హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Teacher Jobs: భారతీయ రైల్వేలో టీచర్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Railway Teacher Jobs: భారతీయ రైల్వేలో టీచర్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Railway Teacher Jobs: భారతీయ రైల్వేలో టీచర్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Railway Teacher Jobs: భారతీయ రైల్వేలో టీచర్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

West Central Railway Teacher Recruitment 2021 | భారతీయ రైల్వేలో టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

  భారతీయ రైల్వేలో క్లర్క్, టికెట్ కలెక్టర్, లోకో పైలట్ లాంటి పోస్టులతో పాటు రైల్వేకు చెందిన విద్యా సంస్థల్లో టీచర్ పోస్టులు కూడా ఉంటాయి. భారతీయ రైల్వేకు చెందిన రైల్వే జోన్స్ ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తుంటాయి. వెస్ట్ సెంట్రల్ రైల్వే ప్రైమరీ టీచర్-PRT, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్-TGT, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్-PGT లాంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 2021-22 విద్యాసంవత్సరం కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇవి తాత్కాలిక పోస్టులు మాత్రమే. మొత్తం 13 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 15 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://wcr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాతే దరఖాస్తు చేయాలి. దరఖాస్తుల్ని నోటిఫికేషన్‌లో వెల్లడించిన ఇమెయిల్ అడ్రస్‌కు చివరి తేదీలోగా మెయిల్ పంపాలి.

  Indian Navy Jobs 2021: ఇంటర్ అర్హతో ఇండియన్ నేవీలో జాబ్స్... అప్లై చేయండి ఇలా

  CISF ASI Recruitment 2021: సీఐఎస్ఎఫ్‌లో 690 ఏఎస్ఐ జాబ్స్... అప్లై చేయండి ఇలా

  West Central Railway Teacher Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే


  మొత్తం ఖాళీలు- 13

  ప్రైమరీ టీచర్ (PRT)- 4

  ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT)- 3 (ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్)

  పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT)- 6 (హిందీ, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, హిస్టరీ, సోషియాలజీ)

  ECIL Hyderabad Recruitment 2021: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

  Indian Navy Recruitment 2021: ఇండియన్ నేవీలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

  West Central Railway Teacher Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


  దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 15

  విద్యార్హతలు- ప్రైమరీ టీచర్-PRT పోస్టుకు 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ, రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాస్ కావాలి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్-TGT పోస్టుకు గ్రాడ్యుయేషన్‌తో పాటు బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్- B.Ed పాస్ కావాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్-PGT పోస్టుకు రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు పాస్ కావాలి.

  వయస్సు- 18 నుంచి 65 ఏళ్లు.

  ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ

  వేతనం- ప్రైమరీ టీచర్-PRT పోస్టుకు రూ.21,250, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్-TGT పోస్టుకు రూ.26,250, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్-PGT పోస్టుకు రూ.27,500.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, Exams, Govt Jobs 2021, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railway Apprenticeship, Railways

  ఉత్తమ కథలు