హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Recruitment 2021: భారతీయ రైల్వేలో 561 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Railway Recruitment 2021: భారతీయ రైల్వేలో 561 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Railway Recruitment 2021 | రైల్వేలో 561 ఖాళీల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

Railway Recruitment 2021 | రైల్వేలో 561 ఖాళీల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

Railway Recruitment 2021 | రైల్వేలో 561 ఖాళీల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  భారతీయ రైల్వేలో ఉద్యోగం కోరుకునేవారికి శుభవార్త. రైల్వేలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. వెస్ట్ సెంట్రల్ రైల్వే ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 561 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. రైల్వేలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డుతో పాటు భారతీయ రైల్వేకు చెందిన వేర్వేరు జోన్లు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేస్తాయన్న సంగతి తెలిసిందే. రైల్వే జోన్లు అప్రెంటీస్ పోస్టులతో పాటు ఇతర ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటాయి. ప్రస్తుతం పశ్చిమ మధ్య రైల్వే 561 అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 27 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://wcr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

  BARC Recruitment 2021: భాభా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్‌లో 160 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

  Indian Navy Recruitment 2021: ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తులు

  West Central Railway Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


  మొత్తం ఖాళీలు- 561

  డీజిల్ మెకానిక్- 35

  ఎలక్ట్రీషియన్- 160

  వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రానిక్స్)- 30

  మెషినిస్ట్- 5

  ఫిట్టర్- 140

  టర్నర్- 5

  వైర్‌మ్యాన్- 15

  మేసన్- 15

  కార్పెంటర్- 15

  పెయింటర్- 10

  గార్డెనర్- 2

  ఫ్లోరిస్ట్ అండ్ ల్యాండ్ స్కేపింగ్ - 2

  పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ - 20

  హార్టికల్చర్ అసిస్టెంట్ - 5

  ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటనెన్స్ - 5

  కంప్యూటర్ ఆపరేటర్ కమ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ - 50

  స్టెనోగ్రాఫర్ (హిందీ) - 7

  స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్) - 8

  అప్రెంటీస్ ఫుడ్ ప్రొడక్షన్ (జనరల్) - 2

  అప్రెంటీస్ ఫుడ్ ప్రొడక్షన్ (వెజిటేరియన్) - 2

  అప్రెంటీస్ ఫుడ్ ప్రొడక్షన్ (కుకింగ్) - 5

  హోటల్ క్లర్క్ లేదా రిసెప్షనిస్ట్ - 1

  డిజిటల్ ఫోటోగ్రాఫర్ - 1

  అసిస్టెంట్ ఫ్రంట్ ఆఫీసర్ మేనేజర్ - 1

  కంప్యూటర్ నెట్‌వర్కింగ్ టెక్నీషియన్ - 4

  క్రెచ్ మేనేజ్‌మెంట్ అసిస్టెంట్ - 1

  సెక్రటేరియల్ అసిస్టెంట్ - 4

  హౌస్ కీపర్ - 7

  హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ - 2

  డెంటల్ ల్యాబరేటరీ టెక్నీషియన్ - 2

  HCL Recruitment drive: నిరుద్యోగులకు శుభవార్త... విజయవాడలో 1000 పోస్టుల భర్తీకి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్

  MIDHANI Recruitment 2021: నెల్లూరులోని మిధాని సంస్థలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 4 రోజులే గడువు

  West Central Railway Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


  దరఖాస్తు ప్రారంభం- 2021 జనవరి 27

  దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 27

  విద్యార్హతలు- 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి

  దరఖాస్తు విధానం- ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేయాలో నోటిఫికేషన్‌లో వెల్లడించింది వెస్ట్ సెంట్రల్ రైల్వే.

  First published:

  Tags: CAREER, Exams, Govt Jobs 2021, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railway Apprenticeship, Railways

  ఉత్తమ కథలు