భారతీయ రైల్వేలో ఉద్యోగాలు (Railway Jobs) కోరుకునేవారికి శుభవార్త. ఇటీవల భారతీయ రైల్వే వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ (Job Notification) విడుదల చేస్తోంది. రైల్వేకు చెందిన వేర్వేరు జోన్లు ఖాళీలను భర్తీ చేసేందుకు వేర్వేరుగా జాబ్ నోటిఫికేషన్స్ (Railway Notification) విడుదల చేస్తున్నాయి. వెస్ట్ సెంట్రల్ రైల్వే కూడా భారీగా ఉద్యోగాల భర్తీకి ఓ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 2226 ఖాళీలున్నాయి. వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 10 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి. ఈ నోటిఫికేషన్ వివరాలతో పాటు ఖాళీల గురించి తెలుసుకోండి.
IBPS Clerk Recruitment 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో 7855 క్లర్క్ జాబ్స్... ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదే
మొత్తం ఖాళీలు | 2226 |
డీజిల్ మెకానిక్ | 77 |
ఎలక్ట్రీషియన్ | 478 |
వెల్డర్ | 147 |
మెషినిస్ట్ | 37 |
ఫిట్టర్ | 491 |
టర్నర్ | 12 |
వైర్‌మ్యాన్ | 67 |
మేసన్ | 86 |
కార్పెంటర్ | 60 |
పెయింటర్ | 165 |
గార్డెనర్ | 4 |
ఫ్లోరిస్ట్ అండ్ ల్యాండ్‌స్కేపింగ్ | 4 |
పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ | 20 |
హార్టికల్చర్ అసిస్టెంట్ | 5 |
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ | 60 |
ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటనెన్స్ | 5 |
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ | 155 |
స్టెనోగ్రాఫర్ (హిందీ) | 28 |
స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్) | 23 |
అప్రెంటీస్ ఫుడ్ ప్రొడక్షన్ (జనరల్) | 2 |
అప్రెంటీస్ ఫుడ్ ప్రొడక్షన్ (వెజిటేరియన్) | 2 |
అప్రెంటీస్ ఫుడ్ ప్రొడక్షన్ (కుకింగ్) | 5 |
హోటల్ క్లర్క్ / రిసెప్షనిస్ట్ | 1 |
డిజిటల్ ఫోటోగ్రాఫర్ | 1 |
అసిస్టెంట్ ఫ్రంట్ ఆఫీసర్ మేనేజర్ | 1 |
కంప్యూటర్ నెట్వర్కింగ్ టెక్నీషియన్ | 4 |
క్రెచ్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ | 1 |
సెక్రెటేరియల్ అసిస్టెంట్ | 4 |
హౌజ్ కీపర్ | 7 |
హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ | 2 |
డెంటల్ లేబరేటరీ టెక్నీషియన్ | 2 |
మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్యూప్మెంట్ మెకానిక్ కమ్ ఆపరేటర్ | 5 |
ఏసీ మెకానిక్ | 9 |
బ్లాక్‌స్మిత్ | 74 |
కేబుల్ జాయింటర్ | 3 |
డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్) | 1 |
డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్) | 14 |
సర్వేయర్ | 9 |
ప్లంబర్ | 66 |
స్యూయింగ్ టెక్నాలజీ | 5 |
ఇండస్ట్రియల్ పెయింటర్ | 5 |
మెకానిక్ (మోటార్ వెహికిల్) | 4 |
మెకానిక్ (ట్రాక్టర్) | 4 |
SBI PO Notification 2021: ఎస్బీఐలో 2,056 ఉద్యోగాలు... డిగ్రీ చదువుతున్నవారికీ ఛాన్స్
దరఖాస్తు ప్రారంభం- 2021 అక్టోబర్ 11 సాయంత్రం 6 గంటలు
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 నవంబర్ 10
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. టెన్త్ క్లాస్ 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు
ఎంపిక విధానం- మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, మహిళలకు ఫీజు లేదు.
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Govt Jobs 2021, Indian Railway, Indian Railways, Job notification, JOBS, Railway Apprenticeship, Railways