Railway Jobs: రైల్వేలో 570 ఉద్యోగాలు... మార్చి 15 లోగా అప్లై చేయండి

West Central Railway Recruitment 2020 | రైల్వేలో ఉద్యోగం కోరుకునేవారికి అనేక అవకాశాలు లభిస్తున్నాయి. భారతీయ రైల్వేకు చెందిన వేర్వేరు జోన్లు ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. పశ్చిమ మధ్య రైల్వే మరో నోటిఫికేషన్ జారీ చేసింది.

news18-telugu
Updated: March 12, 2020, 12:53 PM IST
Railway Jobs: రైల్వేలో 570 ఉద్యోగాలు... మార్చి 15 లోగా అప్లై చేయండి
Railway Jobs: రైల్వేలో 570 ఉద్యోగాలు... మార్చి 15 లోగా అప్లై చేయండి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది వెస్ట్ సెంట్రల్ రైల్వే. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, సెక్రెటేరియల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్-COPA లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. www.mponline.gov.in వెబ్‌సైట్‌లో కూడా దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తుకు మార్చి 15 చివరి తేదీ. ఈ ఉద్యోగాలకు 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://wcr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

West Central Railway Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


ఫిట్టర్- 116

వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)- 34
ఎలక్ట్రీషియన్- 138
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(COPA)- 52


సెక్రెటేరియల్ అసిస్టెంట్- 4పెయింటర్- 23
కార్పెంటర్- 28
ఏసీ మెకానిక్- 10
మెషినిస్ట్- 10
స్టెనోగ్రాఫర్ హిందీ- 3
స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్- 3
ఎలక్ట్రానిక్ మెకానిక్- 15
కేబుల్ జాయింటర్- 2
డీజిల్ మెకానిక్- 30
మేసన్- 26
బ్లాక్‌స్మిత్- 16
సర్వేయర్- 8
డ్రాఫ్ట్స్‌మన్ సివిల్- 10
ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్- 12
సెక్రెటేరియల్ అసిస్టెంట్ ఇంగ్లీష్- 4

West Central Railway Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 15
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 15
విద్యార్హత- 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Singareni Jobs: సింగరేణిలో ఉద్యోగాలు... మార్చి 14 లాస్ట్ డేట్

DRDO Jobs: హైదరాబాద్ డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... మార్చి 14 లాస్ట్ డేట్

APSRTC: ఏపీఎస్‌ఆర్‌టీసీలో 5,000 పైగా అప్రెంటీస్ పోస్టులు... అప్లై చేయండిలా

 
First published: March 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు