WEST CENTRAL RAILWAY INVITES APPLICATIONS FOR 570 APPRENTICE POSTS APPLY BEFORE MARCH 15 SS
Railway Jobs: రైల్వేలో 570 ఉద్యోగాలు... మార్చి 15 లోగా అప్లై చేయండి
హైదరాబాద్ - విశాఖపట్నం, గోదావరి ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెంబర్ 02727/28 )
West Central Railway Recruitment 2020 | రైల్వేలో ఉద్యోగం కోరుకునేవారికి అనేక అవకాశాలు లభిస్తున్నాయి. భారతీయ రైల్వేకు చెందిన వేర్వేరు జోన్లు ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. పశ్చిమ మధ్య రైల్వే మరో నోటిఫికేషన్ జారీ చేసింది.
అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది వెస్ట్ సెంట్రల్ రైల్వే. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, సెక్రెటేరియల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్-COPA లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. www.mponline.gov.in వెబ్సైట్లో కూడా దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తుకు మార్చి 15 చివరి తేదీ. ఈ ఉద్యోగాలకు 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://wcr.indianrailways.gov.in/ వెబ్సైట్లో చూడొచ్చు.
West Central Railway Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...
ఫిట్టర్- 116
వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)- 34
ఎలక్ట్రీషియన్- 138
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(COPA)- 52
సెక్రెటేరియల్ అసిస్టెంట్- 4
పెయింటర్- 23
కార్పెంటర్- 28
ఏసీ మెకానిక్- 10
మెషినిస్ట్- 10
స్టెనోగ్రాఫర్ హిందీ- 3
స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్- 3
ఎలక్ట్రానిక్ మెకానిక్- 15
కేబుల్ జాయింటర్- 2
డీజిల్ మెకానిక్- 30
మేసన్- 26
బ్లాక్‌స్మిత్- 16
సర్వేయర్- 8
డ్రాఫ్ట్స్‌మన్ సివిల్- 10
ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్- 12
సెక్రెటేరియల్ అసిస్టెంట్ ఇంగ్లీష్- 4
West Central Railway Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 15
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 15
విద్యార్హత- 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.