Railway Jobs: రైల్వేలో 200 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్

West Central Railway Recruitment 2020 | భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. పశ్చిమ మధ్య రైల్వే అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: February 24, 2020, 10:37 AM IST
Railway Jobs: రైల్వేలో 200 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్
Railway Jobs: రైల్వేలో 200 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
పశ్చిమ మధ్య రైల్వే 200 ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఇప్పటికే ఈస్టర్న్ రైల్వే 2792 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.  వెస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ కోసం కొద్ది రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్ లాంటి పోస్టులున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు www.mponline.gov.in వెబ్‌సైట్‌లో ఫిబ్రవరి 26 లోగా దరఖాస్తు చేయాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు. మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

West Central Railway Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...



ఫిట్టర్- 50
వెల్డర్- 20
ఎలక్ట్రీషియన్- 60
COPA - 10
సెక్రెటేరియల్ అసిస్టెంట్- 5పెయింటర్- 30
డ్రైవర్ కమ్ మెకానిక్- 5
మెకానిక్ రీపేర్ అండ్ మెయింటనెన్స్ ఆఫ్ వెహికిల్- 10
CNC ప్రోగ్రామర్ కమ్ ఆపరేటర్- 10

West Central Railway Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 27
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 26
విద్యార్హత- సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ.
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

CTET July 2020: టీచర్ కావాలనుకునేవారికి గుడ్ న్యూస్... సీటెట్ 2020 గడువు పెంపు

UPSC Jobs 2020: యూపీఎస్‌సీ నుంచి 886 పోస్టుల భర్తీ... అప్లై చేయండిలా

Telangana Jobs: తెలంగాణలో 1466 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత
Published by: Santhosh Kumar S
First published: February 24, 2020, 10:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading