విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ సీట్ల భర్తీకి తేదీలు ఖరారు..

ఈనెల 24, 25 తేదీల్లో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నామని హెల్త్ వర్సిటీ తెలిపింది. ఇందుకు సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్‌ సైతం జారీ చేసింది.

news18-telugu
Updated: July 24, 2020, 7:51 AM IST
విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ సీట్ల భర్తీకి తేదీలు ఖరారు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజూకీ కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే కరోనా మహమ్మారి దాదాపు అన్ని రంగాలపై ప్రభావం చూపింది. ఇందులో ప్రధానంగా విద్యారంగంపై తీవ్ర ప్రభావం పడిందనే చెప్పాలి. కరోనా పుణ్యమంటూ అసలు విద్యా సంవత్సరమే రద్దు అవుతుందేమో అన్న పరిస్థితులు నెలకొన్నాయి. విద్యా సంవత్సరానికి కీలకంగా ఉండే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో లాక్‌డౌన్ విధించడం వల్ల పరీక్షలన్నీ రద్దయ్యాయి. దీంతో ఆయా కోర్సుల్లో ప్రవేశాలు సైతం నిలిచిపోయాయి. అయితే అప్పటికే పీజీ డెంటల్ కోర్సులకు కౌన్సిలింగ నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా పీజీ డెంటల్ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి వెబ్ కౌన్సిలింగ్ తేదీలను వరంగల్‌లోని కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది.

ఈనెల 24, 25 తేదీల్లో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నామని హెల్త్ వర్సిటీ తెలిపింది. ఇందుకు సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్‌ సైతం జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయనున్నారు. 24వ తేదీ మధ్యాహ్నాం 1 గంట నుంచి 25వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని పేర్కొంది. గత విడతలో కౌన్సిలింగ్‌లో సీటు అలాట్ అయ్యి.. జాయిన్ కాని అభ్యర్థులు, కాలేజీల్లో చేరి డిస్‌కంటిన్యూ అయినవారు ఈ విడత కౌన్సిలింగ్‌కు అనర్హులుగా ప్రకటించింది. ఈ విషయాన్ని విద్యార్థులు దృష్టిలో పెట్టుకోవాలని కోరింది.
Published by: Narsimha Badhini
First published: July 24, 2020, 7:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading