హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Online Courses: ఆన్‌లైన్‌ కోర్సులపై సర్వే.. ఎక్కువ మంది నేర్చుకుంటున్న సాఫ్ట్‌వేర్‌ కోర్సులు ఇవే..!

Online Courses: ఆన్‌లైన్‌ కోర్సులపై సర్వే.. ఎక్కువ మంది నేర్చుకుంటున్న సాఫ్ట్‌వేర్‌ కోర్సులు ఇవే..!

Online Courses: ఆన్‌లైన్‌ కోర్సులపై సర్వే.. ఎక్కువ మంది నేర్చుకుంటున్న సాఫ్ట్‌వేర్‌ కోర్సులు ఇవే..!

Online Courses: ఆన్‌లైన్‌ కోర్సులపై సర్వే.. ఎక్కువ మంది నేర్చుకుంటున్న సాఫ్ట్‌వేర్‌ కోర్సులు ఇవే..!

Online Courses: కొవిడ్‌ అనంతరం ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ విధానం డెవలప్‌ అయిన సంగతి తెలిసిందే. ఎక్కువ మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారంలలో కోర్సులు నేర్చుకుంటున్నారు. ఇష్టమైన జాబ్‌ కోసం విద్యార్థులు కాలేజీలో ఉండగానే ఆన్‌లైన్‌ కోర్సులు చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రస్తుత కాలంలో రోజుకో కొత్త టెక్నాలజీ (New Technology) వస్తోంది. మార్కెట్‌ అవసరాలకు తగినట్లు స్కిల్స్‌ డెవలప్‌ చేసుకుంటేనే మంచి అవకాశాలు లభిస్తాయి. సాఫ్ట్‌వేర్‌ రంగం (Software Field) లో ఈ మార్పు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మెరుగైన కెరీర్‌ (Career) కోసం నిరంతరం కొత్త టెక్నాలజీలతో కుస్తీ పట్టాలి. లేటెస్ట్‌ టెక్నాలజీలపై అవగాహన ఉన్న ఫ్రెషర్లకు కూడా మంచి జాబ్స్‌ దొరుకుతాయి. కొవిడ్‌ అనంతరం ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ విధానం డెవలప్‌ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఎక్కువ మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారంలలో కోర్సులు నేర్చుకుంటున్నారు. ఇష్టమైన జాబ్‌ కోసం విద్యార్థులు కాలేజీలో ఉండగానే కొన్ని ఆన్‌లైన్‌ కోర్సులు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా వెబ్‌ డెవలప్‌మెంట్‌, పైథాన్‌ కోర్సులకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉందని నివేదికలు చెబుతున్నాయి.

* నివేదిక ఏం చెబుతుందంటే?

ఇంటర్న్‌షాలా (Internshala) అనేది ఒక కెరీర్‌ టెక్‌ ప్లాట్‌ఫారం. ఇందులో ఆన్‌లైన్‌లో ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం కల్పిస్తారు. ఇంటర్న్‌షిప్‌ చేసేవారికి స్టైఫెండ్‌ కూడా ఇస్తారు. గుర్గావ్‌ కేంద్రంగా పనిచేస్తుంది. ఆన్‌లైన్‌ కోర్సులకు సంబంధించి ప్రధాన నగరాల్లో సర్వే చేపట్టగా ఈ విషయం నిర్ధారితమైంది.

దీనిపై ఇంటర్న్‌షాలా ట్రైనింగ్‌ హెడ్‌ షాదాబ్ ఆలం మాట్లాడుతూ ఈ లెర్నింగ్‌తో సులువుగా నైపుణ్యాలు పెంచుకునేందుకు అవకాశం కలుగుతోందని అంటున్నారు. దీంతో వీటిని చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని చెబుతున్నారు. పైథాన్‌, వెబ్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులకు చాలాకాలంగా మంచి డిమాండ్‌ ఉండటంతో నేర్చుకునేందుకు చాలామంది ఇంట్రస్ట్‌ చూపిస్తున్నట్లు నివేదిక చెబుతోందని ఆలం చెబుతున్నారు.

* టైర్‌ 3 నగరాల్లో అత్యధికం

పైథాన్‌, వెబ్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులకు టైర్‌-3 నగరాల్లో 34.66 శాతం మంది ఆసక్తి చూపారు. టైర్‌-1 నగరాల్లోని వాళ్లు 30.14 శాతం, టైర్‌-2 నగరాల్లో 18.54 శాతం మంది వీటిని నేర్చుకుంటున్నారు. మంచి ఉద్యోగ అవకాశాల కోసం, తమ నైపుణ్యాలు పెంచుకోడానికి, పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావడానికి ఎక్కువ మంది ఈ కోర్సులను చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దేశం మొత్తం మీద చేసిన సర్వేలో టాప్‌-5 లో కొన్ని మెట్రోపాలిటన్‌ సిటీలు నిలిచాయి.

ఇది కూడా చదవండి : సీయూఈటీ ద్వారా 116 వర్సిటీల్లో అడ్మిషన్స్‌.. కొత్తగా చేరిన యూనివర్సిటీలు ఎన్నంటే?

* ఫస్ట్ ప్లేస్‌లో హైదరాబాద్‌

వెబ్‌ డెవపల్‌మెంట్‌, పైథాన్‌ కోర్సులు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న నగరాలలో మొదటి స్థానంలో హైదరాబాద్‌ నిలిచింది. హైదరాబాద్‌లో 12.81 శాతం మంది ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీలో 12.40 శాతం, బెంగళూరు 11.16, కోల్‌కత్తా, పుణె 8.23 శాతంతో ఉన్నాయి. ఈ సర్వేలో ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా తెలిసింది. 28.38 % మంది తమ స్కిల్‌ పెంచుకోవడం ద్వారా మంచి కెరీర్‌ ఉంటుందని భావిస్తున్నారు.

10.69% మంది సర్టిఫికేట్‌ కోసం ఈ కోర్సులను చేస్తున్నారు. ఇంటర్వ్యూ సమయంలో లేదా ఇతర సందర్భాల్లో ఈ సర్టిఫికేట్‌తో ఉపయోగం ఉంటుందని వారు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థికమాంద్యం పరిస్థితుల నేపథ్యంలో కొత్త కోర్సులు నేర్చుకోవడం, స్కిల్స్‌ పెంచుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

First published:

Tags: Career and Courses, Data science, EDUCATION, JOBS, New courses

ఉత్తమ కథలు