Home /News /jobs /

WEAKENING RUPEE INFLATION AFFECTING INDIAN STUDENTS ABROAD AND THE PROBLEM IS GREATER FOR THE STUDENTS WHO ARE STUDYING IN THE US GH SRD

Abroad Students: విదేశాల్లోని ఇండియన్ స్టూడెంట్స్‌పై రూపాయి క్షీణత ప్రభావం.. ఇబ్బందులను దూరంచేసే మార్గాలివే..

ప్రతీకాత్మక చిత్రం (Shutter Stock)

ప్రతీకాత్మక చిత్రం (Shutter Stock)

Abroad Students: విదేశాల్లో అవసరాల కోసం, సౌకర్యవంతంగా ఉండేందుకు ప్రస్తుతం స్టూడెంట్స్ అదనపు రుణాలు, ఆర్థిక సహకారం తీసుకోవాల్సి వస్తోంది. ఇలాంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే మార్గాల్ని నిపుణల ద్వారా ఇక్కడ తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
రూపాయి పతనం (Rupee Fall)తో విదేశాల(Foriegn Countries)లో, ముఖ్యంగా యూఎస్‌(US)లో చదువుతున్న భారతీయ విద్యార్థులు(Indian Students) ఇబ్బందులు పడుతున్నారని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. అవసరాల కోసం, సౌకర్యవంతంగా ఉండేందుకు ప్రస్తుతం స్టూడెంట్స్ అదనపు రుణాలు, ఆర్థిక సహకారం తీసుకోవాల్సి వస్తోందని అభిప్రాయపడుతున్నారు. రూపాయి విలువ క్షీణిస్తున్నందున, విదేశాలలో భారతీయ విద్యార్థులకు ట్యూషన్ ఫీజుతో పాటు ఇతర ఖర్చులు పెరుగుతున్నాయని తెలిపారు. ఇదే సమయంలో ఇలాంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే మార్గాలను వెల్లడించారు.

కుహూ ఫిన్‌టెక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ ఎ భోంస్లే మాట్లాడుతూ.. ‘కరోనా సమయంలో చాలా ప్రముఖ ఆర్థిక వ్యవస్థలు ఏదో ఒక రూపంలో అస్థిర ఆర్థిక వ్యవస్థలు, మందగమనాలు లేదా ద్రవ్యోల్బణంతో పోరాడుతున్నాయి. విదేశాల్లో ఇప్పటికే పెరుగుతున్న విద్య ఖర్చుకు ద్రవ్యోల్బణం భారం తోడవుతోంది.

యూఎస్‌ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం వల్ల యూఎస్‌కు వెళ్లే విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇది మొత్తం విద్య ఖర్చులను పెంచుతుంది. రూపాయి విలువ తగ్గుదల కారణంగా యూరో, జీబీపీ స్థిరపడింది. దీంతో యూరోపియన్ దేశాలు విదేశీ విద్యకు చౌకైన ఆప్షన్‌గా మారుతున్నాయి.’ అని తెలిపారు.

జ్ఞాన్‌ధన్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు అంకిత్ మెహ్రా మాట్లాడుతూ..‘ఇప్పటికే విదేశాల్లో ఉన్న విద్యార్థులు ఇప్పుడు బయటకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్న వారి కంటే ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటారని నిపుణులు భావిస్తున్నారు. విదేశాలకు వెళ్తున్న వారు అయితే ఆర్థిక ఏర్పాట్లు చేయడానికి లేదా మరేదైనా అడుగు వేయడానికి ఇంకా సమయం ఉంది. అయితే డిగ్రీ రెండవ లేదా మూడవ సంవత్సరం చదువుతున్న వారు ఇప్పటికే విదేశాల్లో నివసిస్తున్నారు, ఇప్పుడు రూపాయి పతనం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు.’ అని చెప్పారు.

డిగ్రీ రెండవ లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల్లో చదువుతున్న వారు అదనపు నిధుల కోసం అడుగుతున్నారని తెలిపారు. ఒక విద్యార్థి అదనపు నిధులు కోరుతూ మాకు మెయిల్ చేశాడని పేర్కొన్నారు. ఖాతాదారులందరికీ మెయిల్‌ పంపామని, 150 మంది విద్యార్థులు అదనపు నిధులు ఇవ్వాలని కోరారని మెహ్రా చెప్పారు. ట్యూషన్ ఫీజులన్నింటినీ ఒకేసారి చెల్లించడం వల్ల ప్రస్తుత, భవిష్యత్తులో ఇటువంటి ఆర్థిక వైఫల్యాల నుంచి విద్యార్థులు బయటపడతారని విశ్లేషించారు.

ఇది కూడా చదవండి : తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్.. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు అవసరమైన డాక్యుమెంట్స్ ఇవే..!

లెవరేజ్ ఎడ్యు వ్యవస్థాపకుడు, సీఈవో అక్షయ్ చతుర్వేది మాట్లాడుతూ..‘విద్యార్థులు భారతదేశంలో INR (భారత రూపాయి)లో రుణాలు తీసుకోవచ్చు. తర్వాత ఫారెక్స్ హెచ్చుతగ్గులను నివారించడానికి మొత్తం ట్యూషన్ ఫీజును ఒకేసారి చెల్లించవచ్చు. కాబట్టి విద్యార్థి నిర్ణయం తీసుకోవడంలో ప్రస్తుతం ఫారెక్స్ హెచ్చుతగ్గులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని మేము నమ్మడం లేదు. విద్యార్థులు రాకముందే విదేశాలలో బ్యాంకు ఖాతాలను తెరవడానికి విద్యార్థులకు సహాయం చేయగలుగుతున్నాం. గ్లోబల్ కరెన్సీ ఫ్లక్స్ ఉన్నట్లయితే ఆ నిధులను అడ్డుకోలేం.’ అని వివరించారు.

భవిష్యత్తు ఆశావహుల విషయానికి వస్తే.. విద్యార్థులు, తల్లిదండ్రులు అంచనాలు, ప్రణాళికలపై ఎక్కువగా ఆధారపడవచ్చని తెలిపారు. ఇలాంటి పరిస్థితి జరగడం ఇదే మొదటిసారి కాదు. పిల్లల కోసం విదేశాల్లో చదువుకునే ప్రణాళికలను రూపొందించేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలని మెహ్రా సూచించారు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, Indian rupee, JOBS, Rupee value, Students

తదుపరి వార్తలు