భారతీయ రైల్వేలో ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. వెస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 165 పోస్టుల్ని ప్రకటించింది. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, ప్లంబర్ లాంటి పోస్టులున్నాయి. ఇంటర్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయినవారు అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 మార్చి 30 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://wcr.indianrailways.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
WCR Apprentice Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2021 మార్చి 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 30
విద్యార్హతలు- 10+2 పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు
దరఖాస్తు ఫీజు- రూ.170. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు రూ.70.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.