హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs In NIT: హాస్టల్ మేనేజర్ ఉద్యోగం.. నెలకు రూ.50 వేలు.. ఏపీ, తెలంగాణ అభ్యర్థులు అర్హులు..

Jobs In NIT: హాస్టల్ మేనేజర్ ఉద్యోగం.. నెలకు రూ.50 వేలు.. ఏపీ, తెలంగాణ అభ్యర్థులు అర్హులు..

Jobs IN NIT: హాస్టల్ మేనేజర్ ఉద్యోగం.. నెలకు రూ.50 వేలు.. ఏపీ, తెలంగాణ అభ్యర్థులు అర్హులు..

Jobs IN NIT: హాస్టల్ మేనేజర్ ఉద్యోగం.. నెలకు రూ.50 వేలు.. ఏపీ, తెలంగాణ అభ్యర్థులు అర్హులు..

Jobs IN NIT: భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఒప్పంద ప్రాతదికన పలు పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ లో హాస్టల్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయున్నారు. నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(NIT)పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా హాస్టల్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు పురుషులు(Male), మహిళలు(Female) కూడా అర్హులే. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ(University) నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ (Bachelor Degree) ఉత్తీర్ణత సాధించాలి. అంతే కాకుండా.. హాస్టళ్లు, మెస్‌లు, క్యాంటీన్‌ల నిర్వహణలో అనుభవం కూడా ఉండాలి. డిఫెన్స్ సర్వీసెస్ ఆఫీసర్స్/పర్సనల్ (ఇండియన్ ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్/GREFలో సర్వీస్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత డిశ్చార్జ్ అయినవారు) లేదా రిటైర్డ్ భారతీయ పారా-మిలటరీ బలగాల (BSF/CISF/CRPF/ITBP) నుండి అవసరమైన అధికారులు/ సిబ్బందికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దరఖాస్తుదారులు అక్టోబర్ 15, 2022 వ తేదీ నాటికి 50 ఏళ్లకు మించకుండా ఉండాలి. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ అక్టోబర్‌ 15, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 665 ఉద్యోగాలు .. దరఖాస్తుకు కొన్ని గంటలే సమయం..

మొత్తం పోస్టుల సంఖ్య 05

దీనిలో మూడు పోస్టులను పురుష అభ్యర్థులకు, 2 పోస్టులు స్త్రీలకు కేటాయించారు.

జనరల్ కేటగిరీకి 4 పోస్టులు, ఓబీసీకి ఒక పోస్టును కేటాయించారు.

దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులు రూ.500లు అప్లికేషన్‌ ఫీజుగా చెల్లించవల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

జీతం..

నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. ఈ పోస్టులను తత్కాళిక ప్రాతిపదికన నియమించుకోనున్నారు. మొదట 2 సంవత్సరాలు, తర్వాత మరో సంవత్సరం పొడిగింపు ఉంటుంది. ఇలా మొత్తం 3 సంవత్సరాల వరకు కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

వయోపరిమితి..

జనరల్ అభ్యర్థులకు 50 ఏళ్లు మించకూడదు. ఓబీసీ అభ్యర్థుల వయస్సు 53 ఏళ్లకు మించకూడదు.

దరఖాస్తు ప్రక్రియ ఇలా..

-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.

-ఓపెన్ అయిన విండోలో నోటిఫికేషన్ కు సంబంధించి వివరాలను తనిఖీ చేయాలి.

-అవసరమైన దరఖాస్తులను జతచేసి నిర్ణీత ఫార్మాట్ లో ఆఫ్ లైన్ విధానంలో పోస్టు చేయాలి.

Merge Entrance Exams: JEE+NEET=CUET దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి క్లారిటీ.. ఏమన్నారంటే..

-అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ కొరకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

-ఎన్వలప్ పేపర్ పై హాస్టల్ మేనేజర్ పోస్ట్ కోసం దరఖాస్తు అని సరిగ్గా రాసి.. రిజిస్ట్రార్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ , NIT వరంగల్ P.O., తెలంగాణ , PIN-506004 అడ్రస్ కు దరఖాస్తులను పంపించాలి.

First published:

Tags: Career and Courses, JOBS, Jobs in telangana, Telangana jobs, Warangal, WARANGAL DISTRICT