Venu, News18, Mulugu
తెలంగాణ (Telangana) లో ఇటీవల వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (TS Job Notifications) రిలీజ్ అవుతున్నాయి. నిరుద్యోగులకు సర్కారీ కొలువులు దక్కేలా ప్రభుత్వం ప్రకటనలు జారీ చేస్తోంది. పర్మినెంట్ ఉద్యోగాలతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా (Warangal District) వ్యాప్తంగా ఔట్సోర్సింగ్ పద్ధతిలో అనేక నోటిఫికేషన్లు వరుసగా జారీ అవుతున్నాయి. 50 పోస్టులకు పైగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ సిబ్బందికి అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే భూపాలపల్లి జిల్లా పరిధిలోని 11 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్న 50కి పైగా ఉద్యోగాలకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు.
స్కావెంజర్ అసిస్టెంట్ కుక్ హెల్పర్ విభాగాలలో 29 పోస్టులు, నాలుగు అకౌంటెంట్ ఉద్యోగాలతో పాటు ఒక ఏఎన్ఎం ఉద్యోగం కూడా ఖాళీగా ఉంది. అలాగే టీచింగ్ విభాగంలో 18 పీజీ సీఆర్పీల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది.
కేజీబీవీ ముత్తారం
పీజీసీఆర్టీ : ఇంగ్లీష్, ఎకనామిక్స్, నర్సింగ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి
కేజీబీవీ మలహర్రావులో ఒక నర్సింగ్ పోస్ట్ ఖాళీగా ఉంది
కేజీబీవీ మొగుళ్లపల్లి
పీజీ సిఆర్ టి : తెలుగు, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ నర్సింగ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి
కేజీబీవీ పలిమెలలో పిజిసిఆర్టి ఇంగ్లీష్ నర్సింగ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి
కేజీబీవీ రేగొండ
పిజిసిఆర్టి: తెలుగు నర్సింగ్ వన్ నర్సింగ్ టు, కామర్స్ ఎకనామిక్స్, సివిక్స్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
కేజీబీవీ భూపాల్ పల్లిలో నర్సింగ్ ఉద్యోగం ఖాళీగా ఉంది.
అర్హతలు
• దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు ఉండాలి
• జయశంకర్ భూపాలపల్లి జిల్లా అభ్యర్థులు మాత్రమే అర్హులు
• ఏఎన్ఎం నర్సింగ్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికెట్ ప్రభుత్వం గుర్తింపు పొంది ఉండాలి
అకౌంటెంట్ ఉద్యోగాలకుఅకౌంటెంట్ ఉద్యోగాలకు
• డిగ్రీ కామర్స్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి
• కంప్యూటర్ స్కిల్స్ ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ వచ్చి ఉండాలి
• వాచ్ మెన్ ఉద్యోగాలకు పదవ తరగతి పాసై ఉండాలి
అసిస్టెంట్ కుక్ హెల్పర్అసిస్టెంట్ కుక్ హెల్పర్
• ఏడవ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
పీజీ సీఆర్పీలు
• పీజీ సీఆర్పీల విద్యా అర్హతలు పీజీ సీఆర్పీల విషయంలో సంబంధిత సబ్జెక్టు నందు పోస్ట్ గ్రాడ్యుయేట్తో పాటు బీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
• అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఒకటి నుండి ఏడవ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు జత చేయాలి.
• సంబంధిత మండల వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది
సందేహాల నివృత్తి కొరకు సంప్రదించాల్సిన నెంబర్లు: 98491 41806, 90009 96933.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Telangana government jobs, WARANGAL DISTRICT