హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Market Research Analyst: మార్కెట్ రిసెర్చ్ అనలిస్ట్‌గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారా.. ఈ గైడెన్స్ మీకోసమే..

Market Research Analyst: మార్కెట్ రిసెర్చ్ అనలిస్ట్‌గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారా.. ఈ గైడెన్స్ మీకోసమే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కెరీర్ ప్లానింగ్ గురించి న్యూస్‌18 అందిస్తున్న కెరీర్ వైజ్‌ కాలమ్‌లో భాగంగా.. మార్కెట్ రీసెర్చ్‌ సెక్టార్‌లో ఎలాంటి అవకాశాలు ఉంటాయి, మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్‌గా కెరీర్ ఎలా ఉంటుందో పరిశీలిద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Market Research Analyst : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం కోసం కాలేజీ రోజుల నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఎంచుకున్న రంగాన్ని బట్టి ఎవరి కెరీర్ అయినా ఆధారపడి ఉంటుంది. కెరీర్ ప్లానింగ్ గురించి న్యూస్‌18 అందిస్తున్న కెరీర్ వైజ్‌ కాలమ్‌లో భాగంగా.. మార్కెట్ రీసెర్చ్‌ సెక్టార్‌లో ఎలాంటి అవకాశాలు ఉంటాయి, మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్‌గా కెరీర్ ఎలా ఉంటుందో పరిశీలిద్దాం.

మార్కెట్‌లో తమ కంపెనీల ఉత్పత్తులు ఎంత బాగా పనిచేస్తాయో అంచనా వేయడంలో మార్కెట్ అనలిస్ట్ కీలకంగా వ్యవహరిస్తారు. మార్కెట్ రీసెర్చ్ (MR) కోర్సులపై పట్టు సాధిస్తే.. కస్టమర్ల ప్రవర్తన, మార్కెట్ ట్రెండ్స్, మార్కెట్ డిమాండ్, ఉత్పత్తులు/బ్రాండ్‌లపై పరిశోధన, అడ్వటైజ్‌మెంట్ ప్రభావం, ధరల నిర్ణయాలు, ప్రమోషన్ ఎఫర్ట్స్ వంటి అనేక విషయాలపై లోతైన అవగాహన పెంపొందించుకోవచ్చు. తద్వారా కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్ రీసెర్చ్‌‌కు సంబంధించిన కొన్ని టెక్నిక్స్‌లో సర్వేలు, ఇంటర్వ్యూలు, ప్యానెల్ చర్చలు, ఫోకస్ గ్రూప్ డిస్కషన్స్, పర్సెప్చువల్ మ్యాపింగ్, లైఫ్‌స్టైల్ స్టడీ, మోటివేషనల్ రీసెర్చ్, మార్కెట్ స్టాటిస్టికల్ డిసెక్షన్ వంటివి ఉంటాయి. కాంపిటీటర్ రీసెర్చ్ అండ్ అనాలసిస్‌లో మార్కెట్ రీసెర్చ్ ఎక్స్‌ఫర్ట్స్ అవసరమైన నాలెడ్జ్‌ను కూడా కాంట్రిబ్యూట్ చేస్తారు.

మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్ బాధ్యతలు

మార్కెట్ అనలిస్ట్ బాధ్యతలు అనేవి కంపెనీలను బట్టి ఉంటాయి. సాధారణంగా సర్వేలు, పోల్స్, ఫోకస్ గ్రూప్స్, క్వశ్చనరీస్ వంటి ద్వారా సమాచారం సేకరించి కొత్త పద్దతులను క్రియేట్ చేయడం, మూల్యాంకనం వంటివి చేయాల్సి ఉంటుంది. స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ద్వారా డేటాను రన్ చేయాలి. స్టాటిస్టికల్ టేబుల్స్ అండ్ రిపోర్ట్స్ ఆధారంగా సేకరించిన డేటాను అర్థం చేసుకోవాలి. ఎగ్జిక్యూటివ్స్ అండ్ క్లయింట్స్ కోరుకునే విధంగా చార్ట్‌లు, గ్రాఫ్స్ ఉపయోగించడం ద్వారా ప్రొడక్ట్ రిలీజెస్, మార్పులు చేర్పులు, మార్కెటింగ్ వ్యూహాలకు సంబంధించిన డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.

SSC CHSL: నవంబర్ 5 నుంచి SSC CHSL అప్లికేషన్స్ ప్రారంభం.. అవసరమైన డాక్యుమెంట్స్ వివరాలు

ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్

మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్‌గా పని చేయడానికి మార్కెటింగ్, మార్కెట్ రీసెర్చ్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్సెస్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కమ్యూనికేషన్స్ లేదా సంబంధిత రంగంలో కనీసం బ్యాచిలర్ డిగ్రీ చేయాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ పొజిషన్ బట్టి కొన్నిసార్లు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) లేదా సంబంధిత రంగంలో మాస్టర్స్ డిగ్రీ కూడా అవసరం.

దీంతోపాటు అభ్యర్థులు మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్‌గా సక్సెస్ కావాలంటే నిర్దిష్ట వ్యక్తిత్వ లక్షణాలతో పాటు స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. ఎంఎస్ ఆఫీస్‌పై మంచి పట్టు ఉండాలి. రీసెర్చ్ డేటాను విశ్లేషించడానికి స్టాటిస్టిక్స్ రీజనింగ్ స్కిల్స్ అవసరం. ఒకేసారి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేపట్టేలా మల్టీ టాస్కింగ్ నైపుణ్యాలు ఉండాలి. వాటిని సకాలంలో పూర్తి చేయాలి. క్లయింట్లతో ఇంటరాక్ట్ కావడానికి అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

 కెరీర్ అవకాశాలు

కొన్ని రిపోర్ట్స్ ప్రకారం.. మార్కెట్ రీసెర్చ్ అండ్ డేటా విశ్లేషణ అవసరం 2016 నుంచి 2029 వరకు 18% పెరుగుతుందని అంచనా. దీంతో మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్‌లకు ఉద్యోగవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

First published:

Tags: Market

ఉత్తమ కథలు