కొత్తగా ఏదైనా నేర్చుకొని ఉద్యోగావకాశాలు పొందాలనుకుంటున్నారా? ఆన్లైన్లో కోర్సులు చేయాలనుకుంటున్నారా? ఫీజులు తీసుకొనే కాదు ఆన్లైన్లో ఉచితంగా కోర్సులు అందించే ప్లాట్‌ఫామ్స్ అనేకం ఉన్నాయి. వాటిని నేర్చుకొని మీ స్కిల్స్ పెంచుకోవచ్చు. ఏ భాషలో అయినా కోర్సులు చేయొచ్చు. మరి ఏఏ ప్లాట్‌ఫామ్స్ ఫ్రీ, పెయిడ్ కోర్సులు అందిస్తున్నాయో తెలుసుకోండి.
Coursera: కోర్స్ఎరా ఇటీవల బాగా వినిపిస్తున్న పేరు. గూగుల్, ఇంటెల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన నిపుణులు కోర్స్ఎరాలో పాఠాలు బోధిస్తారు. ఇందులో ఫ్రీ కోర్సులతో పాటు పెయిడ్ కోర్సులు ఉన్నాయి. పెయిడ్ కోర్సులు రూ.2,000 నుంచే ప్రారంభమవుతాయి. సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్ నుంచి ఎంబీఏ డిగ్రీ వరకు ఏదైనా చదవొచ్చు. 20 డిగ్రీలు, 30 సర్టిఫికెట్స్, 440 స్పెషలైజేషన్స్, 320 ప్రాజెక్ట్స్, 4,300 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డేటా సైన్స్, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ మార్కెటింగ్ లాంటి అంశాల్లో కోర్సులు చేయొచ్చు.
Paytm Jobs: పేటీఎంలో 1,000 పైగా జాబ్స్... వీరికే అవకాశం
HCL Jobs: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో 800 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా
EdX: ఇది నాన్ ప్రాఫిట్ ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్. ఇందులో కూడా ఫ్రీ, పెయిడ్ కోర్సులు ఉంటాయి. పెయిడ్ కోర్సులు సుమారు రూ.4,000 నుంచి ప్రారంభమవుతాయి. సర్టిఫికెట్, డిగ్రీ కోర్సులు చేయొచ్చు. డేటా సైన్స్, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఆర్ట్స్, బయాలజీ, ఎకనమిక్స్ లాంటి అంశాల్లో 2,500 కోర్సులున్నాయి.
Udemy: ఇది ఆన్లైన్ లెర్నింగ్ అండ్ టీచింగ్ ఫోరమ్. 65 భాషల్లో 57,000 ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు. బిజినెస్, డిజైన్, ఫోటోగ్రఫీ, మార్కెటింగ్, ఐటీ అండ్ సాఫ్ట్వేర్ రంగాల్లో 1.5 లక్షల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఫీజు రూ.360 నుంచి మొదలవుతుంది.
Codeacademy: ఇందులో కూడా ఫ్రీ కోర్సులు, పెయిడ్ కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఫ్రీ ఆప్షన్లో బేసిక్ కోర్సులు ళభిస్తాయి. ఏడాదికి రూ.1,199 చెల్లించి ప్రో వర్షన్ తీసుకోవచ్చు. పైథాన్, జావా, జావా స్క్రిప్ట్ లాంటి 14 కోడింగ్ లాంగ్వేజెస్ కోర్సులు ఉంటాయి. వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ లాంటి కోర్సులు చేయొచ్చు.
Work From Home Jobs: ఉద్యోగం లేదా? ఇంటి నుంచే పనిచేస్తూ డబ్బు సంపాదించండి ఇలా
SSC Constable Jobs: ఇంటర్ పాసయ్యారా? 5846 కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేయండి
ApnaCourse: ఇది కూడా ఇ-ట్యూటరింగ్ ప్లాట్‌ఫామ్. ప్రొఫెనల్ కోర్సులు, సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉంటాయి. 27 ఉచిత కోర్సులున్నాయి. నెలకు రూ.150, ఆరు నెలలకు రూ.800, ఏడాదికి రూ.1,500 చొప్పున సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఐటీ అండ్ సెక్యూరిటీ, లా, పర్సనల్ డెవలప్మెంట్ అంశాల్లో 139 కోర్సులుంటాయి.
Alison: వర్క్‌ప్లేస్ బేస్డ్ స్కిల్స్ అందించే కోర్సులు ఈ ప్లాట్ఫామ్లో ఉంటాయి. ఫ్రీ కోర్సులతో పాటు పెయిడ్ కోర్సులున్నాయి. బిజినెస్, మార్కెటింగ్, మ్యాథ్స్, లైఫ్‌స్టైల్ లాంటి అంశాల్లో 1,700 కోర్సులున్నాయి.
Stanford Online: స్టాన్ఫోర్డ్ ఆన్లైన్ సొంత ఫ్యాకల్టీతో అనేక కోర్సుల్ని అందిస్తోంది. ఫ్రీ, పెయిడ్ కోర్సులున్నాయి. సర్టిఫికెట్ నుంచి మాస్టర్ డిగ్రీ వరకు కోర్సులు చేయొచ్చు. కంప్యూటర్ సైన్స్, బిజినెస్ అండ్ మేనేజ్మెంట్, డేటా సైన్స్, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ లాంటి అంశాల్లో కోర్సులున్నాయి.
LinkedIn Learning: లింక్డ్ఇన్ లెర్నింగ్ అనేక ఆన్లైన్ వీడియో కోర్సుల్ని అందిస్తుంది. ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ 5 భాషల్లో కోర్సుల్ని అందించడం విశేషం. ఈ కోర్సులు చేసి సర్టిఫికెట్ పొందొచ్చు. ఒక నెల ఫ్రీ ట్రయల్ ట్రై చేయొచ్చు. నెలకు రూ.1,400 చెల్లించాలి. కోర్సు పూర్తయ్యాక సర్టిఫికెట్ పొందొచ్చు. బిజినెస్, టెక్నాలజీ లాంటి కేటగిరీల్లో 15,000 ఆన్లైన్ కోర్సులున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, JOBS, Online classes, Online Education