Home /News /jobs /

WANT TO GO BEYOND MBBS KNOW AYUSH NEET COUNSELLING PROCESS COURSES TO APPLY AACCC GOV IN GH VB

AYUSH NEET: MBBS సీటు మిస్సయిందా..? అంతకు మించిన కోర్సులను అందిస్తున్న ఆయుష్ నీట్.. కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాల కోసం NEET-2021 కటాఫ్‌కు మ్యాచ్​ అయ్యే అభ్యర్థులు aaccc.gov.inలో ఆయుష్ అడ్మిషన్స్ సెంట్రల్ కౌన్సెలింగ్ కమిటీ (AACCC) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (NEET) 2021లో ఉత్తీర్ణత సాధించినప్పటికీ.. ఎంబీబీఎస్(MBBS) సీటు రాలేదా? అయినా ఏం ఫర్వాలేదు. ఎందుకంటే అంతేస్థాయిలో డిమాండ్ ఉన్న ఇతర కోర్సుల ద్వారా మీరు డాక్టర్ అయ్యే అవకాశం ఉంది. హోమియోపతి, ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునానీ, సిద్ధ, సోవా, రిగ్బా వంటి ఆయుష్ కోర్సులకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మీకోసం. దేశంలోని 15 శాతం ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీకి నీట్-ఆయుష్ కౌన్సెలింగ్​ను (NEET AYUSH Counselling) రెండు రౌండ్లలో నిర్వహిస్తున్నారు. డీమ్డ్, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ కళాశాల్లో విడిగా కౌన్సెలింగ్ జరుగుతుంది. మిగిలిన 85 శాతం సీట్లకు రాష్ట్ర కౌన్సెలింగ్ అధికారులు నీట్ ఆయుష్ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తారు.

Yogyata App: రూరల్ యూత్‌కు అద్భుతమైన ఛాన్స్.. యోగ్యత యాప్​ ద్వారా జాబ్​ ఆఫర్.. పూర్తి వివరాలివే..


ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాల కోసం NEET-2021 కటాఫ్‌కు మ్యాచ్​ అయ్యే అభ్యర్థులు aaccc.gov.inలో ఆయుష్ అడ్మిషన్స్ సెంట్రల్ కౌన్సెలింగ్ కమిటీ (AACCC) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంబీబీఎస్(MBBS), బీడీఎస్(BDS) కోర్సుల్లో అడ్మిషన్ కోసం mcc.nic.inలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఆయుష్ కౌన్సెలింగ్ కింద విద్యార్థులు బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BHMS), బ్యాచిలర్ ఆఫ్ యునాని మెడిసిన్ అండ్ సర్జరీ (BUMS), బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద, మెడిసిన్, సర్జరీ (BAMS) కోర్సులకు అర్హులవుతారు.

ఆయుష్ నీట్ కౌన్సెలింగ్.. దరఖాస్తు ఎలా?

స్టెప్-1: ఆయుష్ అడ్మిషన్స్ సెంట్రల్ కౌన్సెలింగ్ కమిటీ (AACCC) అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

స్టెప్-2: హోమ్‌పేజీలో, రిజిస్ట్రేషన్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

స్టెప్-3: మీ వివరాలను నమోదు చేసుకోండి.

స్టెప్-4: కావాల్సిన కళాశాల, కోర్సులను ఎంపిక చేసుకుని దరఖాస్తు ఫామ్‌ను పూర్తి చేయాలి.

స్టెప్-5: రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి సబ్​మిట్ చేయండి.

స్టెప్-6: తదుపరి ఉపయోగం కోసం నింపిన ఫారమ్‌ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి

ఎన్ని సీట్లు ఉన్నాయి?
దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఆయుష్ కోర్సులకు సంబంధించి మొత్తం 52,720 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కౌన్సెలింగ్ ప్రక్రియలో విద్యార్థుల మెరిట్, వారు ఎంచుకున్న ఆప్షన్స్, ఖాళీగా ఉన్న సీట్ల ఆధారంగా వారికి సీట్​ కేటాయిస్తారు. సీటు రిజర్వ్ చేసుకునేందుకు అడ్మిషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Amazon Great Republic Day Sale 2022: వాటిపై భారీ డిస్కౌంట్.. రూ. 2,799 ధరకే ఆ ప్రొడక్ట్ సొంతం..


అనంతరం సంబంధింత కాలేజీలో రిపోర్ట్ చేయాలి. ప్రస్తుతం వచ్చిన కాలేజీలో చేరకూడదనుకుంటే.. దాన్ని వదిలేసి, తదుపరి రౌండ్ కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం వేచి ఉండాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో కౌన్సెలింగ్ నోటిఫికేషన్ చూడవచ్చు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, NEET

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు