హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Teaching Internships: టీచింగ్ ఫీల్డ్ లో రాణించాలనుకుంటున్నారా ? అయితే ఈ సంస్థల్లో చేరండి. స్టైఫండ్ కూడా ఇస్తారు..

Teaching Internships: టీచింగ్ ఫీల్డ్ లో రాణించాలనుకుంటున్నారా ? అయితే ఈ సంస్థల్లో చేరండి. స్టైఫండ్ కూడా ఇస్తారు..

టీచింగ్ ఫీల్డ్ లో రాణించాలనుకుంటున్నారా ? అయితే ఈ  సంస్థల్లో చేరండి. స్టైఫండ్ కూడా ఇస్తారు..

టీచింగ్ ఫీల్డ్ లో రాణించాలనుకుంటున్నారా ? అయితే ఈ సంస్థల్లో చేరండి. స్టైఫండ్ కూడా ఇస్తారు..

ఉపాధ్యాయ(Teaching) వృత్తి ఎంతో కీలకమైనది. సమాజంలో ఎంతో ఉన్నత పాత్ర పోషిస్తుంది కూడా. ఈ రంగంలో ఆధునిక సాంకేతిక పోటీ ప్రపంచంలో ఉపాధ్యాయులు మెళకువలు నేర్చుకోవాల్సిందే. ఎప్పటికప్పుడు తమ బోధన పద్ధతులను మార్చుకోవాలి. ఇలాంటి నైపుణ్యాలను(Skills) నేర్పించడానికి కొన్ని సంస్థలు ఉన్నాయి.

ఇంకా చదవండి ...

ఏ రంగంలోనైనా మెరుగైన అవకాశాలు అందుకోవాలంటే ఎక్స్‌పీరియన్స్ (experience)కీలకం. ఉపాధ్యాయ, ప్రొఫెసర్ వృత్తిని ఎంచుకోవాలని అనుకుంటున్న అభ్యర్థులకు కూడా ఇది వర్తిస్తుంది. విద్యార్థులతో ఎలా కనెక్ట్ అవ్వాలో అనేదానిపై అవగాహన పెంచుకోవడం, పాఠాలు సరళంగా చెప్పడం కోసం సొంత బోధనా పద్ధతులను అభివృద్ధి చేయడం వంటివి ఎక్స్ పీరియన్స్‌తో వస్తాయి. ఇందుకు ఇంటర్న్‌షిప్‌(Internships)లు గొప్ప మార్గంగా కనిపిస్తాయి. కొన్ని సంస్థలు టీచింగ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టాయి. దీంతో టీచింగ్(Teaching) ఫీల్డ్ ఎంచుకోవాలని అనుకుంటున్న వారికి ఇవి బాగా ఉపయోగపడతాయి. పైగా స్టైఫండ్ కూడా లభిస్తుంది. మరి, ఆ జాబితాపై ఓ లుక్కేయండి..

సాఫ్టో‌మేషన్ సర్వీసెస్‌

ఈ సంస్థ ఆరునెలల పార్ట్‌టైమ్ ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. టీచింగ్ కోసం ఎంపికైన అభ్యర్థులు ఫరీదాబాద్‌లో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి పొందే నెలవారీ స్టైఫండ్ పూర్తిగా వారి పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ఇది రూ.10,000 వరకు ఉండవచ్చు. లేదా ఏమీ ఇవ్వకపోవచ్చు. ఆసక్తి ఉన్నవారు AICTE ఇంటర్న్‌షిప్ పోర్టల్ ద్వారా జూలై 17 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇదీ చదవండి:  Sexual Health: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?


క్యాంప్ కె 12

వర్క్ ఫ్రమ్ హామ్ విధానంలో ఈ సంస్థ మూడు నెలల ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పిస్తుంది. ఎంపికైన వారికి రూ.16,000 నుంచి రూ. 26,000 వరకు నెలవారీ స్టైఫండ్‌ ఇవ్వనున్నారు. అభ్యర్థులు 2 నుంచి 8 తరగతులకు హై క్వాలిటీతో ఇంగ్లీష్‌ను బోధించాల్సి ఉంటుంది. అర్హత ఉన్నవారు జులై 27లోపు ఇంటర్న్‌షాలా( Internshala) అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

నిధి గోలేచా

అసిస్టెంట్ టీచర్ ఇంటర్న్‌షిప్‌ కోసం నిధి గోలేచా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇది ముంబై కేంద్రంగా పనిచేయనుంది. ఈ ఇంటర్న్ షిప్ 6 నెలల పాటు కొనసాగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ. 10,000 స్టైఫండ్ వస్తుంది. ఫుల్ టైమ్ (ఇన్-ఆఫీస్) ఇంటర్న్‌షిప్‌లకు అందుబాటులో ఉండాలనుకున్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్న్‌షాలాలో దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ జులై 26గా నిర్ణయించారు.

ఎస్‌బీ ప్లే స్కూల్‌

ఈ స్కూల్ అసిస్టెంట్ టీచర్ ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇది ప్రోగ్రామ్ ఆరు నెలల పాటు జరగనుంది. ఇక్కడ పార్ట్ టైమ్ గా కూడా పనిచేయవచ్చు. ఎంపికైన వారు ఢిల్లీలోని ఎస్‌బీ ప్లే స్కూల్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులకు రూ. 5000 నుంచి రూ. 8000 వరకు నెలవారీ స్టైఫండ్‌ ఇవ్వనున్నారు. అర్హులైన వారు ఇంటర్న్‌షాలా పోర్టల్ ద్వారా జులై 25లోపు దరఖాస్తు చేసుకోవాలి.

మెయిన్ మార్షల్స్

ఆరు నెలల టీచింగ్ ఇంటర్న్‌షిప్ కోసం మెయిన్ మార్షల్స్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన వారు మొరాదాబాద్, కాన్పూర్ నుండి పని చేయాల్సి ఉంటుంది. కోడింగ్ నేర్పించడంలో నైపుణ్యం ఉన్న వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఎంపికైన వారు నెలకు రూ.10,000 స్టైఫండ్‌ అందుకుంటారు. ఇంటర్న్‌షాలా వెబ్‌సైట్ ద్వారా జులై 25లోగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

ఇది ఇలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వ పాలసీ రూపకల్పనలో నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సదరు సంస్థ వ్యవసాయం, డేటా మేనేజ్‌మెంట్ అండ్ అనాలసిస్, ఆర్థికశాస్త్రం, ఎడ్యుకేషన్, మానవ వనరుల అభివృద్ధి, ఇంధన రంగం, విదేశీ వాణిజ్యం/వాణిజ్యం, మైనింగ్, పర్యాటకం, క్రీడలు వంటి రంగాల్లో ఇంటర్న్ షిప్‌ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. ఈ ఇంటర్న్‌షిప్ కనీసం ఆరు వారాల నుంచి గరిష్టంగా ఆరు నెలల వరకు ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంస్థ అధికారిక పోర్టల్ niti.gov.in/internship ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ ప్రతి నెల 1వ తేదీ నుంచి 10 వరకు ఓపెన్‌లో ఉండనుంది.

Published by:Mahesh
First published:

Tags: Career and Courses, Internship, Lecturer roles, Teaching

ఉత్తమ కథలు