హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Exams-Results In March: మార్చి నెలలో ప్రకటించనున్న పరీక్షలు, ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఇవే.. తెలుసుకోండి.. 

Exams-Results In March: మార్చి నెలలో ప్రకటించనున్న పరీక్షలు, ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఇవే.. తెలుసుకోండి.. 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మార్చి నెలలో నీట్, యూపీ బోర్డు పరీక్షలు, అప్ టెట్ రిజల్ట్స్ సహా అనేక ఇతర పరీక్షలు, రిజల్ట్స్ ప్రకటించనున్నారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

కరోనా (Corona) వల్ల గత రెండేళ్లుగా ఫిజికల్ ఎగ్జామ్స్ (Physical Mode Exams) నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గడంతో 2022 నుంచి 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలు (Board Exams) ఫిజికల్ మోడ్‌లోనే జరగనున్నాయి. సీబీఎస్ఈ (CBSE) ప్రస్తుత అకడమిక్ ఇయర్ ని రెండు భాగాలుగా డివైడ్ చేసి సిలబస్‌ను రెండు భాగాల్లో కవర్ చేస్తోంది. బోర్డు టర్మ్ 1 ఎగ్జామ్ రిజల్ట్స్ త్వరలో విడుదల కానుండగా, టర్మ్ 2 పరీక్షలు ఏప్రిల్ నుంచి నిర్వహించనున్నారు. అయితే మార్చి నెలలో నీట్, యూపీ బోర్డు పరీక్షలు, అప్ టెట్ రిజల్ట్స్ సహా అనేక ఇతర పరీక్షలు, రిజల్ట్స్ ప్రకటించనున్నారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

జేఈఈ (JEE) మెయిన్ 2022

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2022 వెబ్‌సైట్ అయిన jeemain.nta.nic.in తాజాగా లాంచ్ అయ్యింది. ఇది జేఈఈ మెయిన్ 2022కి సంబంధించిన వివరాలను ఇంకా విడుదల చేయలేదు. కానీ జేఈఈ మెయిన్ 2022కి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రావచ్చని తెలుస్తోంది. ఈ ఏడాది జేఈఈ మెయిన్ పరీక్షను రెండుసార్లు నిర్వహించే అవకాశం ఉంది.

Civil Services: ఐఏఎస్, ఐపీఎస్ మీ లక్ష్యమా..? అయితే ఈ బుక్స్, ప్రిపరేషన్ టిప్స్ ఫాలో అవ్వండి..


సీబీఎస్ఈ (CBSE) టర్మ్ 1 బోర్డు రిజల్ట్స్

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) టర్మ్ 1 బోర్డు రిజల్ట్స్ మార్చి నెలలో ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత సీబీఎస్ఈ ఏప్రిల్ 26 నుంచి 10, 12వ తరగతులకు బోర్డు ఎగ్జామ్స్‌ను నిర్వహించనుంది. ప్రస్తుతానికైతే సీబీఎస్ఈ బోర్డు పరీక్షల డిటైల్డ్ ఎగ్జామ్ షెడ్యూల్ లేదా డేట్ షీట్‌ను విడుదల చేయలేదు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌ను మాత్రం మార్చి 2 నుంచి నిర్వహించాలని తన అనుబంధ పాఠశాలలను కోరింది. ఈ పాఠశాలలు థియరీ పేపర్‌ల కంటే కనీసం 10 రోజుల ముందుగా ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.

యూపీ బోర్డు పరీక్షలు

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత 10, 12 తరగతులకు ఉత్తరప్రదేశ్ బోర్డు పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. డిటైల్డ్ డేట్ షీట్ ఇంకా విడుదల కాలేదు కానీ బోర్డు ఏప్రిల్, మే నెలల్లో పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది. 10, 12 తరగతుల్లో చేరిన మొత్తం 50 లక్షల మంది విద్యార్థుల కోసం ఈ పరీక్షల నిర్వహణకు 8,373 కేంద్రాలను ఏర్పాటు చేసింది బోర్డు. ఎగ్జామ్ షెడ్యూల్ రాబోయే వారాల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

యూపీటెట్ (UPTET) రిజల్ట్స్

గతేడాది పేపర్ లీక్ కారణంగా ఉత్తర్‌ప్రదేశ్‌ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UPTET) 2021 జనవరి 23, 2022న నిర్వహించడం జరిగింది. ఈ టెస్ట్ ఫలితాలను ఫిబ్రవరి చివరి నాటికి రిలీజ్ చేయాల్సి ఉండగా... మోడల్ కోడ్ కారణంగా అది వాయిదా పడింది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విద్యాశాఖ యూపీటెట్ రిజల్ట్స్ విడుదల చేయనుంది. తేదీ నిర్ధారణ ఇంకా విడుదల కాలేదు కానీ రిజల్ట్స్ ఏప్రిల్ వరకు వాయిదా పడొచ్చు.

AP 10th Science Exam: ఏపీలోని టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఈ సారి సైన్స్ సిలబస్ ఇదే.. వివరాలివే

నీట్ 2022

కోవిడ్-19కి ముందు అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET) ప్రతియేటా ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహించేవారు. అయితే ఈసారి నీట్ 2022 ఎగ్జామ్ జూన్ వరకు వాయిదా పడింది. ఎగ్జామ్ డేట్ కు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. అయితే మార్చిలో నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలుస్తోంది. ఆ తర్వాత నీట్ 2022 ఎగ్జామ్ డేట్ కన్ఫామ్ అవుతుంది.

సీటెట్ (CTET) రిజల్ట్స్

సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) రిజల్ట్స్ డేట్ వాయిదా పడుతూ వస్తోంది. సీబీఎస్ఈ రిజల్ట్స్ తేదీని ఇంకా ప్రకటించినప్పటికీ నోటిఫికేషన్ ఏప్రిల్ వరకు వాయిదా పడొచ్చని తెలుస్తోంది.

First published:

Tags: Career and Courses, CBSE, Results, Telangana exams

ఉత్తమ కథలు