Home /News /jobs /

VSSC RECRUITMENT 2021 VIKRAM SARABHAI SPACE CENTRE INVITES APPLICATIONS FOR 158 POSTS KNOW HOW TO APPLY SS

VSSC Recruitment 2021: విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్‌లో 158 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

VSSC Recruitment 2021: విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్‌లో 158 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

VSSC Recruitment 2021: విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్‌లో 158 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

VSSC Recruitment 2021 | విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్-VSSC జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు, నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోండి.

    నిరుద్యోగులకు గుడ్ న్యూస్. విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్-VSSC టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా పాస్ అయినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. మొత్తం 158 ఖాళీలున్నాయి. ఇవి ఏడాది కాలవ్యవధి గల పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 4 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.vssc.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్నాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చెరీ రాష్ట్రాల్లో డిప్లొమా పాస్ అయినవారు మాత్రమే అప్లై చేయాలి.

    VSSC Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 158
    ఆటోమొబైల్ ఇంజనీరింగ్- 8
    కెమికల్ ఇంజనీరింగ్- 25
    సివిల్ ఇంజనీరింగ్- 8
    కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్- 15
    ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 10
    ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 40
    ఇన్‌స్ట్రుమెంట్ టెక్నాలజీ- 6
    మెకానికల్ ఇంజనీరింగ్- 46

    RITES Recruitment 2021: రైల్వే సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    Railway Jobs: రైల్వే జాబ్ అలర్ట్... మరో నోటిఫికేషన్ వచ్చేసింది... రూ.92,300 వరకు వేతనం

    VSSC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 జూలై 26 ఉదయం 10 గంటల నుంచి
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఆగస్ట్ 4 సాయంత్రం 5 గంటల వరకు
    విద్యార్హతలు- గుర్తింపు పొందిన స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి సంబంధిత బ్రాంచ్‌లో మూడేళ్ల డిప్లొమా 60 శాతం మార్కులు పొందాలి. 2018 అక్టోబర్ కన్నా ముందు డిప్లొమా పాస్ అయినవారు అర్హులు కాదు. డిప్లొమా ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసిన అభ్యర్థులు కూడా అర్హులు కాదు.
    వయస్సు- 2021 ఆగస్ట్ 4 నాటికి 30 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
    స్టైపెండ్- నెలకు రూ.8,000.
    ఎంపిక విధానం- మెరిట్, రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ద్వారా ఆఫర్ లెటర్ పంపిస్తారు.

    Railway Jobs: రైల్వేలో 1664 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల... ఖాళీల వివరాలు ఇవే

    IT Jobs 2021: ఐటీ కంపెనీల్లో ఫ్రెషర్స్‌కి 1,20,000 ఉద్యోగాలు

    VSSC Recruitment 2021: అప్లై చేయండి ఇలా


    అభ్యర్థులు ముందుగా https://www.vssc.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    అప్రెంటీస్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి.
    అభ్యర్థులు తమ పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో దరఖాస్తు ఫామ్ నింపాలి.
    అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
    అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
    ఎంపికైన అభ్యర్థులు నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్-NATS పోర్టల్ http://portal.mhrdnats.gov.in/ లో రిజిస్టర్ చేయాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Upcoming jobs

    తదుపరి వార్తలు