Home /News /jobs /

VIZAG STEEL RECRUITMENT 2022 RASHTRIYA ISPAT NIGAM LIMITED VISAKHAPATNAM RELEASED JOB NOTIFICATION FOR VARIOUS VACANCIES KNOW HOW TO APPLY SS

Jobs in Vizag Steel: వైజాగ్ స్టీల్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Jobs in Vizag Steel: వైజాగ్ స్టీల్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Jobs in Vizag Steel: వైజాగ్ స్టీల్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Jobs in Vizag Steel | విశాఖపట్నంలోని వైజాగ్ స్టీల్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. కాంట్రాక్ట్ పద్ధతిలో పలు పోస్టుల్ని భర్తీ చేస్తోంది రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు అలర్ట్. విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ (RINL) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ కంపెనీని వైజాగ్ స్టీల్ (Vizag Steel) అని కూడా పిలుస్తుంటారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఉన్న లైమ్‌స్టోమ్ మైన్స్‌లో పలు ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మైన్ ఫోర్‌మ్యాన్, మైనింగ్ మేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది వైజాగ్ స్టీల్. మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు విశాఖపట్నంలో ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. ఈ పోస్టులకు 2022 జనవరి 26న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 ఫిబ్రవరి 9 చివరి తేదీ. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలతో పాటు విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

    Vizag Steel Recruitment 2022: ఖాళీల వివరాలు ఇవే...





























    మొత్తం ఖాళీలు5విద్యార్హతలుఅనుభవంవయస్సువేతనం
    మైన్ ఫోర్‌మ్యాన్1డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ పాస్ కావడంతో పాటు మైన్ ఫోర్‌మ్యాన్ సర్టిఫికెట్ ఉండాలి.మెకనైజ్డ్ ఓపెన్‌క్యాస్ట్ మెటాల్లిఫెరస్ మైన్స్‌లో ఐదేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసి ఉండాలి.35 ఏళ్ల లోపునెలకు రూ.39,000 + రూ.1,750 హెచ్ఆర్ఏ
    మైనింగ్ మేట్4ఎస్ఎస్‌సీ లేదా మెట్రిక్యూలేషన్ పాస్ కావాలి.మెకనైజ్డ్ ఓపెన్‌క్యాస్ట్ మెటాల్లిఫెరస్ మైన్స్‌లో ఐదేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.35 ఏళ్ల లోపునెలకు రూ.37,000 + రూ.1,680 హెచ్ఆర్ఏ

    Teacher Jobs: అలర్ట్... 8,000 పైగా టీచర్ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

    Vizag Steel Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2022 జనవరి 26

    దరఖాస్తుకు చివరి తేదీ- 2022 ఫిబ్రవరి 9

    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

    అనుభవం- అభ్యర్థులకు అనుభవం తప్పనిసరి.

    వయస్సు- 2022 జనవరి 1 నాటికి 35 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్‌సీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

    ఎంపిక విధానం- ఆన్‌లైన్ టెస్ట్

    ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Railway Jobs: నిరుద్యోగులకు అలర్ట్... ఈ తప్పు చేస్తే జీవితంలో రైల్వే ఉద్యోగం రాదు


    Vizag Steel Recruitment 2022: దరఖాస్తు విధానం ఇదే...


    Step 1- అభ్యర్థులు https://www.vizagsteel.com/ వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్ ఓపెన్ చేయాలి.

    Step 2- కెరీర్స్ సెక్షన్‌లో ఫోర్‌మ్యాన్, మైనింగ్ మేట్ జాబ్ నోటిఫికేషన్ ఉంటుంది.

    Step 3- ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

    Step 4- మొదటి దశలో అభ్యర్థి వివరాలతో రిజిస్ట్రేషన్ చేసి ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

    Step 5- రెండో దశలో ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.

    Step 6- డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Andhra Pradesh Government Jobs, Central Government Jobs, Govt Jobs 2022, Job notification, JOBS, State Government Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు