Vizag Steel Jobs: వైజాగ్ స్టీల్‌లో 188 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Vizag Steel Plant Recruitment 2020 | దరఖాస్తు ప్రక్రియ 2020 జనవరి 24న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 13 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://www.vizagsteel.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

news18-telugu
Updated: January 17, 2020, 3:27 PM IST
Vizag Steel Jobs: వైజాగ్ స్టీల్‌లో 188 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Vizag Steel Jobs: వైజాగ్ స్టీల్‌లో 188 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు చెందిన కార్పొరేట్ సంస్థ పేరొందిన రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్-RINL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్) పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 188 ఖాళీలున్నాయి. ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఏడాది శిక్షణ ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ 2020 జనవరి 24న ప్రారంభం కానుంది. అదే రోజున దరఖాస్తు లింక్ యాక్టివేట్ అవుతుంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 13 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://www.vizagsteel.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

Vizag Steel Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 188

సిరామిక్స్- 4
కెమికల్- 26
సివిల్ - 5


ఎలక్ట్రికల్- 45ఇన్‌స్ట్రుమెంటేషన్ & ఎలక్ట్రానిక్స్- 10
మెకానికల్- 77
మెటల్లార్జీ- 19
మైనింగ్- 2

Vizag Steel Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 24
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 13
విద్యార్హత- సంబంధిత విభాగంలో ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ
వయస్సు- 27 ఏళ్ల లోపు. ఎస్సీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.590. ఎస్సీ, వికలాంగులకు రూ.295.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

Metro Rail Jobs: ఢిల్లీ మెట్రో రైల్‌లో 1493 జాబ్స్... దరఖాస్తు గడువు పొడిగింపు

SBI Clerk Jobs: ఎస్‌బీఐలో 7,870 క్లర్క్ ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా

AP Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 16,208 ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి
First published: January 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు