Home /News /jobs /

VIZAG STEEL PLANT RECRUITMENT 2020 NOTIFICATION RELEASED FOR 11 MANAGEMENT TRAINEE POSTS KNOW FULL DETAILS SS

Andhra Pradesh Jobs: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Andhra Pradesh Jobs: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Andhra Pradesh Jobs: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Vizag Steel Plant Recruitment 2020 | వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

    ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌నే రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్-RINL అని పిలుస్తారు. ఈ కంపెనీలో హెచ్ఆర్, మార్కెటింగ్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ https://www.vizagsteel.com/ ఓపెన్ చేసి దరఖాస్తు చేయాలి. ఈ పోస్టులకు 2020 జూలై 20న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తు చేయడానికి 2020 ఆగస్ట్ 10 చివరి తేదీ.

    Vizag Steel Plant Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 11
    మేనేజ్‌మెంట్ ట్రైనీ (హెచ్ఆర్)- 6
    మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్)- 3
    మేనేజ్‌మెంట్ ట్రైనీ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్)- 2
    విద్యార్హతలు- కనీసం 60% మార్కులతో డిగ్రీ పాస్ కావడంతో పాటు ఎంబీఏ పాస్ కావాలి. అభ్యర్థులు 2020 లో యూజీసీ నెట్ క్వాలిఫై కావడం తప్పనిసరి.
    వయస్సు- 27 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు.
    ఎంపిక విధానం- యూజీసీ నెట్ 2020 పరీక్షలో మెరిట్‌తో పాటు పర్సనల్ ఇంటర్వ్యూ.
    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Railway Jobs: సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు... మే 20 చివరి తేదీ

    TCS Internship: ఇంట్లో కూర్చొనే ఇంటర్న్‌షిప్... విద్యార్థులకు అద్భుత అవకాశం

    Railway Jobs: ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 663 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION, Telugu news, Telugu updates, Telugu varthalu

    తదుపరి వార్తలు