Exams Postponed: కరోనా వైరస్ కారణంతో ఈ పరీక్షలన్నీ వాయిదా

Coronavirus Outbreak | కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. వాటి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: March 18, 2020, 1:12 PM IST
Exams Postponed: కరోనా వైరస్ కారణంతో ఈ పరీక్షలన్నీ వాయిదా
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం ఉన్నైట్లెతే వారిని ప్రత్యేక గదుల్లో ఉంచి పరీక్ష రాయిస్తామని విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఎవరైనా ఇన్విజిలేటర్లకు పైలక్షణాలు ఉంటే.. వారిని విధుల నుంచి తప్పించి రిజర్వులో ఉన్నవారితో పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
  • Share this:
కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ మహమ్మరి విస్తరించకుండా అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రాలన్నీ స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాయి. కొన్ని చోట్ల పరీక్షలు మాత్రం యథాతథంగా సాగుతున్నాయి. అయితే ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షలు కూడా వాయిదా పడుతున్నాయి. గతంలో ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టిన సంస్థలన్నీ ఇప్పుడు పోటీ పరీక్షల్ని వాయిదా వేస్తున్నాయి. మరి కరోనా వైరస్ కారణంతో ఏఏ పరీక్షలు వాయిదా పడ్డాయో తెలుసుకోండి.

విశాఖపట్నంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ 188 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు 2020 మార్చి 22న ఆన్‌లైన్ టెస్ట్ జరగాల్సి ఉంది. కానీ... కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ పరీక్షను వాయిదా వేస్తున్నామని, మళ్లీ ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తామో త్వరలో ప్రకటిస్తామని వైజాగ్ స్టీల్ ప్లాంట్ నోటీస్ విడుదల చేసింది.

సెంట్రల్ ఎయిర్‌మెన్ సెలక్షన్ బోర్డ్-CASB ఎయిర్‌మెన్ స్టార్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్‌ను మార్చి 19 నుంచి 23 వరకు నిర్వహించాల్సి ఉండగా ఎగ్జామ్‌ను ఏప్రిల్ చివరి వారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఎగ్జామ్‌కు సంబంధించిన అప్‌డేట్స్ కోసం https://airmenselection.cdac.in/ వెబ్‌సైట్ ఫాలో కావాలని సూచించింది.

మార్చి 22 ఆదివారం దేశవ్యాప్తంగా 11 నగరాల్లో జరగాల్సిన రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్‌ను వాయిదా వేస్తున్నట్టు ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్-ITBP ప్రకటించింది. సుమారు 50,000 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయాల్సి ఉంది. వారందరికీ ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందించింది. కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఐటీబీపీ అధికార ప్రతినిధి తెలిపారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న మెయిన్స్ ఎగ్జామ్‌ను వాయిదా వేసింది. కొత్త తేదీలను త్వరలో ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో ప్రకటిస్తామని తెలిపింది.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:Jobs: బీటెక్ పాసైనవారికి 259 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

DRDO Jobs: హైదరాబాద్‌ డీఆర్‌డీఓలో జాబ్స్... మార్చి 20 చివరి తేదీ

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
First published: March 18, 2020, 1:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading