కరోనా (Corona) నేపథ్యంలో అనేక మంది ఉపాధి కోల్పోయారు. దీంతో అనేక మంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో చదువు కొనసాగించడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పేద విద్యార్థులకు చేయూతను అందించేందుకు అనేక కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. విద్యార్థులకు స్కాలర్ షిప్ (Scholarship)లు అందిస్తూ వారి పై చదువులకు ప్రోత్సహిస్తున్నాయి. తాజాగా ప్రముఖ మొబైల్ తయారీదారు వివో (Vivo) విద్యార్థులకు శుభవార్త చెప్పింది. 11 క్లాస్ విద్యార్థులకు స్కాలర్ షిప్ అందించనున్నట్లు ప్రకటించింది. ప్రముఖ విద్యాసారథి (Vidyasarathi) సంస్థతో కలిసి ఈ స్కాలర్ షిప్ లు అందించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. మెరిట్ ఆధారంగా విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందించనున్నట్లు తెలిపింది. విద్యార్థులు వారి కలలను, ఉన్నత లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి ఈ స్కాలర్ షిప్ లను అందిస్తున్నట్లు వివో తెలిపింది. ఈ స్కాలర్ షిప్ తో పాటు విద్యార్థులకు వారి ఆన్లైన్ విద్యకు సహకరించేందుకు వివో స్మార్ట్ ఫోన్ ను కూడా అందించనున్నట్లు వివో తెలిపింది.
స్కాలర్ షిప్ అర్హతలు:
అభ్యర్థులు 80 శాతం మార్కులతో టెన్త్ పాసై ఉండాలి. అయితే 4 లక్షల వార్షికాదాయం కన్నా తక్కువ ఉన్న వారికే ఈ స్కాలర్ షిప్ అందించనున్నట్లు వివో తెలిపింది. అభ్యర్థులు జనవరి 13 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.
LIC Scholarship: విద్యార్థులకు ఎల్ఐసీ నుంచి స్కాలర్‌షిప్... దరఖాస్తు లింక్ ఇదే
అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ వివరాలు, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, పాస్ బుక్ కాపీ, టెన్త్ మార్క్స్ షీట్, ఆదాయ సర్టిఫికేట్, ఈ విద్యాసంవత్సరం ఫీజు రసీదు. బోనఫైడ్ సర్టిఫికేట్ .jpeg, .png కాపీలను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇతర వివరాలకు vidyasaarathi@nsdl.co.in మెయిల్ చిరునామాను సంప్రదించవచ్చు. 022-40904484 నంబర్ ను సైతం సంప్రదించవచ్చు.
#vivoForEducation in collaboration with @Vidyasaarathi present Merit Based Scholarship Program for students in need, Where we support the ambitions of aspiring students to achieve their dreams. pic.twitter.com/Y4zZHr24iB
— Vivo India (@Vivo_India) January 13, 2022
-విద్యార్థులు ఈ లింక్ పై క్లిక్ చేసి ఈ స్కాలర్ షిప్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
-స్కాలర్ షిప్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.
స్కాలర్ షిప్ వివరాలు: ఈ స్కాలర్ షిప్ కు ఎంపికైన వారికి రూ.1500తో పాటు, నూతన వివో స్మార్ట్ ఫోన్ కూడా అందిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.