హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Vivo Ignite: స్కూల్ స్టూడెంట్స్ కోసం వివో స్పెషల్ కంటెస్ట్.. రూ.25 లక్షల క్యాష్ ప్రైజ్..

Vivo Ignite: స్కూల్ స్టూడెంట్స్ కోసం వివో స్పెషల్ కంటెస్ట్.. రూ.25 లక్షల క్యాష్ ప్రైజ్..

Vivo Ignite: స్కూల్ స్టూడెంట్స్ కోసం వివో స్పెషల్ కంటెస్ట్.. రూ.25 లక్షల క్యాష్ ప్రైజ్..

Vivo Ignite: స్కూల్ స్టూడెంట్స్ కోసం వివో స్పెషల్ కంటెస్ట్.. రూ.25 లక్షల క్యాష్ ప్రైజ్..

Vivo Ignite: వివో ఇగ్నైట్ (Vivo Ignite) పేరుతో ఎనిమిది నుంచి 12 తరగతుల విద్యార్థుల కోసం ఓ పోటీని నిర్వహించనుంది. కొత్త ఆవిష్కరణలు చేసేలా విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ కాంపిటీషన్‌ను నిర్వహిస్తున్నట్లు వివో తెలిపింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

విద్యార్థులను (Students) ప్రోత్సహించడానికి, వారిలో పోటీతత్వాన్ని పెంపొందించటానికి అనేక సంస్థలు క్విజ్ కాంపిటీషన్స్, సైన్స్‌ఫేర్ వంటి పోటీలను నిర్వహిస్తుంటాయి. తాజాగా ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో (Vivo) కూడా ఇలాంటి ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. వివో ఇగ్నైట్ (Vivo Ignite) పేరుతో ఎనిమిది నుంచి 12 తరగతుల విద్యార్థుల కోసం ఓ పోటీని నిర్వహించనుంది. కొత్త ఆవిష్కరణలు చేసేలా విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ కాంపిటీషన్‌ను నిర్వహిస్తున్నట్లు వివో తెలిపింది. ఇందులో విజేతలకు సైన్స్ అండ్ ఇన్నొవేషన్ అవార్డ్ కింద క్యాష్ ఫ్రైజ్ అందుతుంది. 10 మంది విజేతలకు రూ.25 లక్షల క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నారు.

* అర్హతలు

- వివో ఇగ్నైట్ కాంపిటీషన్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థులు 8-12 తరగతుల మధ్య చదువుతూ ఉండాలి.

- ఈ పోటీలను సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మూడు దశల్లో నిర్వహించనున్నారు.

- కాంపిటీషన్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 12తో ముగుస్తుంది.

- అభ్యర్థులు ఐడియా సబ్మిషన్ దశలో తమ ప్రాజెక్ట్ ఐడియాలను 150-250 పదాల సారాంశంతోపాటు ప్రాజెక్టును వర్ణించే పోస్టర్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

- వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీలో టాప్ 25 అభ్యర్థులు పోటీ పడతారు. వారు తమ ప్రాజెక్ట్‌లను వ్యక్తిగతంగా ప్రదర్శించనున్నారు. ప్రముఖ జ్యూరీ సభ్యులతో కూడిన ప్యానెల్ సమక్షంలో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. క్రియేటివ్ థికింగ్, ఇన్నొవేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపయోగం, పాజిటివ్ సోషల్ ఇంఫాక్ట్ వంటి ప్రాథమిక అంశాలపై ఆధారంగా అభ్యర్థులను జడ్జ్ చేయనున్నారు.

- కాంపిటీషన్‌లో పొల్గొనే నామినీలందరికీ ఆన్‌లైన్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేస్తారు. కాన్సెప్ట్ అండ్ ప్రోటోటైప్ నామినీలతో కూడిన 200 మంది జోనల్ విజేతలకు (ఉత్తరం, దక్షిణం, తూర్పు, పశ్చిమ జోన్స్ నుంచి 50 మంది చొప్పున) ట్రోఫీలు, సర్టిఫికెట్లతో సత్కరించనున్నారు.

* భారీగా రివార్డ్

ఇన్నొవేటివ్ థింకర్స్‌‌ను ప్రోత్సహించేందుకు కాంపిటీషన్ చివరి దశలో సైన్స్ అండ్ ఇన్నొవేషన్ పేరుతో అవార్డులను ప్రదానం చేయనున్నారు. టాప్ 10 విజేతలకు క్యాష్ ఫ్రైజ్ ఇవ్వనున్నారు. జాతీయ స్థాయిలో ఎంపికైన విజేతలకు రూ. 75,000 నుంచి రూ. 5,00,000 వరకు రివార్డుతో పాటు మెడల్, సర్టిఫికేట్ అందజేస్తారు. ఇక మిగిలిన 15 మంది పోటీదారులకు మెడల్స్, సర్టిఫికేట్ ప్రదానం చేయనున్నారు.

ఇది కూడా చదవండి : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. వివిధ రంగాల్లో 4.80 లక్షల ఖాళీలు.. వెంటనే అప్లై చేసుకోండి

వివో ఇండియా బిజినెస్ స్ట్రాటజీ హెడ్ పైగమ్ డానిష్ మాట్లాడుతూ... భారత్ వంటి దేశాల్లో ప్రాబ్లమ్‌సాల్వ్ టెక్నాలజీ అండ్ క్రియేటివ్ ఐడియాలను ప్రదర్శించడానికి విద్యార్థుల కోసం వివో ఇగ్నైట్ ద్వారా ఓ వేదికను అందిస్తున్నామని తెలిపారు. దీంతో ఔత్సాహిక యువతలో ప్రాబ్లమ్ సాల్వ్ విధానాన్ని ప్రోత్సహించినట్లవుతుందని పేర్కొన్నారు. వివో ఇగ్నైట్ యువతను ఆవిష్కరణ వైపు ప్రోత్సహిస్తుందని చెప్పారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS, Vivo

ఉత్తమ కథలు