హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Andhra pradesh: ఇంటి బాధ్యతలు చూసే గృహిణికి.. ఐఐఎంలో రెండు గోల్డ్ మెడల్స్

Andhra pradesh: ఇంటి బాధ్యతలు చూసే గృహిణికి.. ఐఐఎంలో రెండు గోల్డ్ మెడల్స్

44 ఏళ్ల వయసులో ఐఐఎం నుంచి రెండు గోల్డ్ మెడల్స్

44 ఏళ్ల వయసులో ఐఐఎం నుంచి రెండు గోల్డ్ మెడల్స్

చదువుకు వయసు అడ్డు కాదని నిరూపించారు విశాఖపట్నానికి చెందిన ఓ మహిళ.. సంకల్పం ఉంటే ఏదైనా సాధించొచ్చు అని చేసి చూపించారు ప్రేరణ.. ఐఐఎంలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించి ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తున్నారు.

సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని ఓ మహిళ నిరూపించారు. సాధరణంగా కాలేజీలో ఎంత బాగా చదివినా కూడా.. పెళ్లైన తరువాత చదువు ఏంటి అని మహిళలు అసలు ఆ జోలికే పోరు. కొంతమంది చదువుపై ప్రేమతో.. ఏదో ఒకలా డిగ్రీ పూర్తయితే చాలు అని సరిపెట్టుకుంటారు. ఇలాంటివి చాలా ఇళ్లలో సర్వసాధారణం.. ఎందుకంటే పెళ్లైన తరువాత చదువుకోడం అంత ఈజీ కాదు.. మెట్టినింట అడుగు పెట్టిన కోడలిగా.. ఆ ఇంటి బాధ్యత చూసుకోడానికి తొలి ప్రాధాన్యం ఇస్తారు మహిళలు. అలాంటి మహిళల్లో ఒకరు ప్రేరణ.. ఓ వైపు భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ.. ఇంటి పనులు అన్నీ చక్కదిద్దుకుంటూ.. నిత్యం బిజీగా ఉండే ప్రేరణ.. చదువుపై ఉండే మక్కువతో కఠినంగా శ్రమించారు.. సాధ్యం కాదని ఎంతమంది చెప్పినా.. పట్టుదలతో తన సంలక్పం దిశగా అడుగులు వేశారు. చివరికి ఎవరి ఊహకు అందని విధంగా.. రెండు బంగారు పతకాలు సాధించారు. అది కూడా చిన్నా చితకా ఇనిస్టిట్యూట్స్ లో కాదు.. ఎంతో మందికి కలగా మిగిలే ఐఐఎం నుంచి రెండు గోల్డ్ మెడల్స్ సాధించి ఆమె ఎంతో మందికి ప్రేరణగా నిలిచారు..

ఆమె వయసు 44 ఏళ్లు.. అయినా అనుకున్న లక్ష్యాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఓ వైపు ఇంటి బాధ్యతలు చూసుకుంటునే.. ఉన్నత విద్యాపై ఫోకస్ చేశారు. అనుకున్న టార్గెట్ చేరుకోడానికి తీవ్రంగా శ్రమించారు. ఎం బి ఎ లో ,ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో ఈ రెండు బంగారు పతకాలు సాధించారు. ఐఐఎం విశాఖపట్నం నుండి మొదటి ర్యాంకు రావడంతో గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు.

దాంతో పాటు స్కాలస్టిక్ పెర్ఫార్మెన్స్ (Scholastic performance)లో ఎంబీఏ పూర్తి చేసి గోల్డ్ మెడల్ పొందారు. ఉన్నత చదువులు చదవడానికి వయసు అడ్డురాదని నిరూపించారు. ప్రముఖ ఐటీ కంపెనీ అధినేత, ఎసిఎన్ ఇన్ ఫో టెక్ సిఈఓ చమన్ బెయిడ్ సతీమణి ప్రేరణ. నగరంలో పేరునున్న కుటుంబం నుంచి వచ్చిన ఆమె.. ఆ ఇంటికి మరింత పేరు తెచ్చాు.. ప్రముఖ సంఘ సేవకులు, వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం వాకర్సు క్లబ్ ( చార్టర్ నెం-1 )అద్యక్షులు, రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షులు, కమల్ బెయిడ్ కోడలే ఈ ప్రేరణ. 

అసలు ఈ వయసులో చదువుకోడమే చాలా కష్టం.. పాస్ అయితే చాలు అనుకుంటున్నారు చాలా మంది. కానీ ఈ వయసులో చదవడం ఒక ఎత్తైతే.. గోల్డ్ మెడల్ తెచ్చు కోవడం మరో ఘనత.  దీంతో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆ ఇంటి సభ్యులు అంతా ప్రేరణతో తమ కుటుంబానికి మరింత పేరు తెచ్చారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


ప్రస్తుతం కమల్ బెయిడ్ ఎంతో మందికి తమ సంస్థ ద్వారా ఉపాధి కలిపిస్తున్నారు. ప్రేరణ బెయిడ్ కూడా తనకు భవిష్యత్తులో చాలా లక్ష్యాలు ఉన్నాయని.. ఈ గోల్డ్ మెడల్స్ సాధించడం తన బాధ్యతను మరింత పెంచేలా చేశాయని అంటున్నారు. తనకు ఇంత విజయం దక్కడానికి కుటుంబ సభ్యుల సహకారమే కారణమంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, EDUCATION, Visakhapatnam