HDFC Recruitment: కరోనా కాలంలో పాసైన డిగ్రీ అభ్యర్థులు అనర్హులు..! వైరల్ అయిన ఉద్యోగ ప్రకటన.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

HDFC Rectuitment: తమిళనాడులో బ్రాంచ్ సేల్స్ ఆఫీసర్‌ల నియామకం కోసం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన ఉద్యోగ సర్క్యులర్ వైరల్ గా మారింది. 2021 ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు కాదు అంటూ అందులో పేర్కొంది. అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    కరోనా కారణంగా పరీక్షలు రాయలేని దుస్థితి ఏర్పడింది. ఇక తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వాలు కొన్ని నిబంధనల మేరా పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే హెచ్‌డీఎఫ్‌సీకి సంబంధించిన ఓ జాబ్ సర్కులర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ జాబ్ సర్కులర్‌లో ఉన్న కండీషన్ చూసి అంతా విస్తుపోతున్నారు. అంతా దాని గురించే చర్చించుకుంటున్నారు. ఇంతకీ అందులో ఏముందంటే.. కరోనా కాలంలో పాసైన అభ్యర్థులు అనర్హులంటూ అందులో పేర్కొన్నారు. అంటే 2021లో ఎగ్జామ్స్ రాయకుండా పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు అనర్హులు అని అర్థం. డిగ్రీ క్వాలిఫికేషన్ తో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది హెచ్‌డీఎఫ్‌సీ . అందులో.. 2021 పాస్ అవుట్ బ్యాచ్ నాట్ ఎల్జిబుల్ అని స్పష్టంగా ఉంది. ఈ కండీషన్ కారణంగా జాబ్ సర్కులర్ ఒక్కసారిగా వైరల్ గా మారింది. దీనిపై తీవ్రంగా విమర్శలు వచ్చి.. వివాదానికి దారి తీయడంతో హెచ్ డీ ఎఫ్ సీ యాజమాన్యం స్పందించింది.

    అది అక్షర దోషం అని వివరణ ఇచ్చింది. సర్కులర్ లో తప్పు వచ్చినందుకు విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. తర్వాత డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు అని, పాస్ అయిన సంవత్సరంతో ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. కరెక్షన్ చేసిన సర్కులర్ ని మళ్లీ షేర్ చేసినట్టు హెచ్ డీఎఫ్ సీ తెలిపింది.






    ఈ సర్కులర్ పై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. పరీక్షలు లేకుండా పాసై కరోనా బ్యాచ్ గా ముద్రవేయించుకున్న విద్యార్థులు ఎందుకూ పనికిరాకుండా పోతున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం అని వాపోతున్నారు. వీటిపై విపరీతంగా మీమ్స్ కూడా వేశారు.
    Published by:Veera Babu
    First published: