15తో ముగియనున్న ‘విద్యార్థి విజ్ఞాన మంథన్‌’ పరీక్ష రిజిస్ట్రేషన్

vidyarthi vigyan manthan 2019 | ఆరో తరగతి నుంచి 11వ తరగతి వరకు విద్యార్థులకు గణిత,సామాన్య శాస్త్రాల్లో ఆసక్తిపెంచేందుకు ప్రతి యేటా ఈ ప్రతిభా పాటవ పోటీ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.

news18-telugu
Updated: August 19, 2019, 9:51 AM IST
15తో ముగియనున్న ‘విద్యార్థి విజ్ఞాన మంథన్‌’ పరీక్ష రిజిస్ట్రేషన్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలోని అన్ని పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి 11వ తరగతి చదువుతున్న విద్యార్థులో ప్రతిభను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ‘‘విద్యార్థి విజ్ఞాన మంథన్‌’’ పోటీ పరీక్షకు రిజిస్ట్రేషన్‌ చేసుకునే గడువు సెప్టెంబరు 15వ తేదీతో ముగియనుంది. ప్రతియేటా నాలుగు అంచల్లో ఈ పోటీ పరిక్షను నిర్వహిస్తారు. పరీక్షను ఆల్‌లైన్‌లో నిర్వహించనున్నారు. పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పోటీ పరీక్షలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు ‌www.vvm.org.in వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. నవంబరు 4 లేదా 30వ తేదీల్లో పరీక్షల నిర్వహణ ఉంటుంది. డిసెంబరు 15న ఫలితాలు వెలువడతాయి.

విద్యార్థులకు ఆరో తరగతి నుంచే సామాన్యశాస్త్రం, గణితంలో ఆసక్తి కలిగిస్తే ఉన్నత చదవుల్లో రాణించి దేశ పురోగతికి పాటుపడుతారన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘విద్యార్థి విజ్ఞాన మంథన్’ వేదికను ఏర్పాటు చేసింది. రిజిస్ట్రేషన్ ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఈ ప్రతిభా పాటవ పరీక్షలో పాల్గొనదలిచే విద్యార్థులు వారి వివరాలను జాప్యం లేకుండా వెబ్‌సైట్‌లో నమోదుచేసుకోవాలి. ఉపాధ్యాయుల సాయంతో వెబ్‌సైట్‌లో సిలబస్ సహా అన్ని వివరాలను విద్యార్థులు తెలుసుకోవాలి. ఇప్పటి నుంచే పాఠ్య పుస్తకాలు, అదనపు సమాచారాన్ని అందుబాటులో ఉంచుకుని ప్రతిభ పరీక్షకు విద్యార్థులు సన్నద్ధంకావాలి. ఈ పోటీ పరీక్షలపై విద్యార్థులకు ఉపాధ్యాయులు తగిన సూచనలు, సలహాలు చేయాలి. విద్యార్థులు ‘విద్యార్థి విజ్ఞాన మంథన్‌’ పోటీ పరీక్షలో పాల్గొనేలా ప్రోత్సహించాలి.

First published: August 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు