మీకు వీడియో ఎడిటింగ్ అంటే ఇష్టమా? దీన్నే మీరు కెరీర్ ఆప్షన్‌గా సెలక్ట్ చేసుకున్నారా..? అయితే మీకు ఒక అలర్ట్. వీడియో ఎడిటింగ్‌లో రాణించేందుకు, అవసరమైన స్కిల్స్ పెంచుకునేందుకు ప్రముఖ సంస్థలు ఇంటర్న్‌షిప్ ఆఫర్స్ ప్రకటించాయి. వీడియో ఎడిటర్(video editor)గా పనిచేయడానికి అవసరమైన నాలెడ్జ్ వీటి ద్వారా పొందవచ్చు. ఆ వివరాలు చూద్దాం.
* ఆల్ఫాస్ డిజిటల్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్
ఈ కంపెనీ వీడియో ఎడిటింగ్, వీడియో క్రియేషన్ ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేస్తోంది. ఇంటర్న్‌షాలా పోర్టల్ ద్వారా అప్లికేషన్లు అప్లై చేసుకోవచ్చు. ఇందుకు చివరి తేదీ నవంబర్ 25. ఇది 2 నెలల వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్‌షిప్. ఎంపికైన అభ్యర్థులు రూ. 3,500 నుంచి రూ. 4,500 మధ్య నెలవారీ స్టైఫండ్ పొందుతారు.
* టీమ్ 121 క్రియేటర్స్
ఈ కంపెనీ వీడియో ఎడిటింగ్ & మోషన్ గ్రాఫిక్స్ ఇంటర్న్‌షిప్ అందిస్తోంది. అభ్యర్థులు నవంబర్ 26 లోపు ఇంటర్న్‌షాలా పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారు టీమ్ 121 క్రియేటర్స్ సంస్థలో 6 నెలల పాటు పనిచేయాలి. వర్క్ ఫ్రం హోం సదుపాయం కూడా ఉంది. వీరికి నెలకు రూ.5,000 నుంచి రూ.8,000 వరకు స్టైఫండ్ ఇస్తారు. ఇంటర్న్‌షిప్ పూర్తయిన తర్వాత రికమండేషన్ లెటర్ కూడా ఇస్తారు.
* YOOF
ఈ కంపెనీ ఆరు నెలల వీడియో ఎడిటింగ్(Video Editing) ఇంటర్న్‌షిప్ అనౌన్స్ చేసింది. ఇంటర్న్‌షాలా ద్వారా నవంబర్ 25 లోపు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారు వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేయాల్సి ఉంటుంది. వీరికి నెలకు రూ. 5,000 స్టైఫండ్ లభిస్తుంది.
* ఇమ్యూజ్
వీడియో ఎడిటింగ్ కోసం ఇమ్యూజ్(Imumz) సంస్థ ఇంటర్న్షిప్స్ ప్రకటించింది. ఆసక్తి ఉన్నవారు ఇంటర్న్‌షాలా పోర్టల్‌లో నవంబర్ 26 లోపు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు 4 నెలల పాటు ఇంటి నుంచి పని చేయాల్సి ఉంటుంది. వీరికి నెలకు రూ.11,000 నుంచి రూ.13,000 మధ్య స్టైఫండ్ ఇస్తారు.
* మై అకాడమీ (My Academy)
ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్‌షిప్. మూడు నెలల పాటు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.7,000 స్టైఫండ్ చెల్లిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఇంటర్న్‌షాలా(Internshala) పోర్టల్ ద్వారా అప్లై నవంబర్ 26 లోపు చేసుకోవచ్చు.
* మంచి కెరీర్ ఆప్షన్
వీడియో ఎడిటింగ్‌లో ఇప్పుడు అనేక అవకాశాలు ఉన్నాయి. అయితే వీడియో ఎడిటర్స్‌కు క్రియేటివిటీ అవసరం. ఈ రంగంలో జీతాలు కూడా బాగానే ఉండటంతో దీన్ని కెరీర్‌గా ఎంచుకునే వారి సంఖ్య పెరిగింది. దీంతో కాంపిటీషన్ కూడా ఎక్కువైంది. అందుకే ఈ సెక్టార్లో ఎదగాలనుకునే ఫ్రెషర్లు ముందుగా ఇంటర్న్‌షిప్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, Internship, JOBS, Video