Army Jobs: ఆర్మీలో ఉద్యోగానికి రూ.5 లక్షలు... మోసగాడి అరెస్ట్

Army Jobs | ఆర్మీలో ఉద్యోగాల పేరుతో 40 మందిని మోసం చేసినట్టు తేలింది. మిలిటరీ దుస్తుల్లో తిరుగుతూ, ఫోటోలు చూపిస్తూ మోసం చేసినట్టు తేలింది.

news18-telugu
Updated: September 27, 2019, 6:30 PM IST
Army Jobs: ఆర్మీలో ఉద్యోగానికి రూ.5 లక్షలు... మోసగాడి అరెస్ట్
Army Jobs: ఆర్మీలో ఉద్యోగానికి రూ.5 లక్షలు... మోసగాడి అరెస్ట్
  • Share this:
ఆర్మీ ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 22 ఏల్ల రవి యాదవ్ మిలిటరీ దుస్తుల్లో తిరుగుతూ ఆర్మీలో ఉద్యోగాల పేరుతో వల వేస్తున్నాడు. రూ.5 లక్షలు ఇస్తే ఆర్మీలో జాబ్ ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేస్తున్నాడు. తాను ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాని నమ్మించేవాడు. మిలిటరీ యూనిఫామ్‌లో ఉండటంతో రవి యాదవ్ చెప్పేది నిజమని నమ్మేవారు నిరుద్యోగులు. సైన్యంలో చేరాలనుకునే యువకుల దగ్గర డబ్బులు తీసుకొని ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీల్లో సెలెక్ట్ అయ్యేలా చేస్తానని చెప్పేవాడు. రెండు నెలల క్రితం మిలిటరీ ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది. రవి చేతిలో మోసపోయినవారితో మాట్లాడిన మిలిటరీ ఇంటెలిజెన్స్‌ సిబ్బంది పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సదరు మోసగాడిని పట్టుకున్నారు. ఆర్మీలో ఉద్యోగాల పేరుతో 40 మందిని మోసం చేసినట్టు తేలింది. మిలిటరీ దుస్తుల్లో తిరుగుతూ, ఫోటోలు చూపిస్తూ మోసం చేసినట్టు తేలింది. అంతేకాదు... నిరుద్యోగులకు నకిలీ అడ్మిట్ కార్డ్స్, జాయినింగ్ లెటర్స్ కూడా ఇచ్చినట్టు తేలింది. అతడి నుంచి మిలిటరీ దుస్తులు, ఆర్మీ బ్యాడ్జులు, రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో అతడిపై కేసు నమోదు చేశారు. 2017లో ఇలాంటి మోసానికి పాల్పడితే అస్సాం పోలీసులు రవి యాదవ్‌ను కటకటాల్లోకి పంపారు. విడుదలైన తర్వాత మళ్లీ అలాంటి మోసాలకే పాల్పడుతున్నాడు.

ఇటీవల దేశవ్యాప్తంగా రిక్రూట్‌మెంట్ ర్యాలీలు నిర్వహిస్తోంది ఆర్మీ. వచ్చే నెలలో కరీంనగర్‌లోనూ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. ఎవరైనా ఇలాగే డబ్బులిస్తే ఆర్మీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నిరుద్యోగులు అస్సలు నమ్మొద్దు. ఆర్మీలో ఉద్యోగాలకు ఇండియన్ ఆర్మీ అధికారికంగా నియామక ప్రక్రియ చేపడుతుంది. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంటాయి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Jobs: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 330 ఉద్యోగాలు... రేపటి నుంచి దరఖాస్తులుBECIL Jobs: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 35 ఉద్యోగాలు

ISRO Jobs: ఇస్రోలో ఇంజనీర్ జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: September 27, 2019, 6:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading