హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AAI Recruitment 2021: ఎయిర్‌పోర్టు అథారిటీలో ఉద్యోగాలు.. జీతం రూ.ల‌క్ష‌

AAI Recruitment 2021: ఎయిర్‌పోర్టు అథారిటీలో ఉద్యోగాలు.. జీతం రూ.ల‌క్ష‌

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ప‌లు పోస్టుల భ‌ర్తీకి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేష‌న్(Notification) విడుద‌ల చేసింది. AAI రిక్రూట్‌మెంట్ 2021లో భాగంగా ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. Airport Authority of India అధికారిక వెబ్‌సైట్ ద్వారా పలు విభాగాలకు అర్హులైన అభ్య‌ర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...

  ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (Airport Authority of India) సీనియ‌ర్ అసిస్టెంట్ పోస్టుల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. AAI రిక్రూట్‌మెంట్ 2021 ద్వారా ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. వీటికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన అధికారి వెబ్‌సైట్ https://www.aai.aero/ ఉన్నాయి. ప‌లు విభాగాల్లో క‌లిపి మొత్తం 29 పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు సంబంధించి అర్హ‌త‌లు, ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి విష‌యాలు తెల‌సుకోండి.

  Total posts29
  Senior Assistant in Operations14
  Senior Assistant in Finance06
  Senior Assistant in Electronics09


  అర్హ‌త‌లు ఇవే..

  * సీనియర్‌ అసిస్టెంట్‌ (Operations) - ఈ పోస్టులకు అప్లే (Apply) చేసుకునే వారు ఎల్‌ఎమ్‌వీ లైసెన్స్‌తో పాటు మేనెజ్‌మెంట్‌లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

  * సీనియర్‌ అసిస్టెంట్‌ (finance) - బీకామ్‌ డిగ్రీతో పాటు సుమారు మూడు నుంచి ఆర నెలల వ్యవధిలో అర్హ‌మైన కంప్యూటర్‌ కోర్స్‌ చేసి ఉండాలి.

  * సీనియర్‌ అసిస్టెంట్‌ (Electronic) - ఎలక్ట్రానిక్స్‌/టెలికమ్యూనికేషన్‌/రేడియో ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత క‌లిగి ఉన్న‌వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

  SSC GD Constable Exam 2021: ఆల‌స్యం చేయ‌కండి.. 25,271 పోస్టుల‌ ద‌ర‌ఖాస్తుకు ముగియ‌నున్న గడువు


  ముఖ్య‌మైన తేదీలు (Important Dates)

  ద‌ర‌ఖాస్తుల ప్రారంభ‌తేదీ - జూలై 29, 2021

  ద‌ర‌ఖాస్తు చేసుకొనేందుకు చివ‌రి తేదీ - ఆగ‌స్టు 31, 2021

  ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానం

  Step -1 : ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు అధికారి వెబ్‌సైట్‌(https://www.aai.aero/en)ను సంద‌ర్శించాలి.

  Step -2 : నోటిఫికేష‌న్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి.

  Step -3 : నోటిఫికేష‌న్‌లో తెలిపిన విధంగా అర్హ‌త‌లు క‌లిగిన అభ్య‌ర్థులు వారి వివ‌రాల‌ను ఈ-మెయిల్ ద్వారా పంపాలి.

  Step -4 : అనంత‌రం పూర్తి బ‌యోడేటాను నోటిఫికేష‌న్‌లో ఇచ్చిన అడ్ర‌స్‌కు పంపాలి.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Airport, JOBS

  ఉత్తమ కథలు