Job Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ప్రముఖ సంస్థలో 10 వేల ఉద్యోగాలు.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

UST Recruitment: అమెరికన్ టెక్నాలజీ సంస్థ యూఎస్టీ.. ఈ సంవత్సరం కనీసం పదివేల మంది ఉద్యోగులను తీసుకోనున్నామని ప్రకటించింది. వివిధ దేశాల్లోని సంస్థ బ్రాంచ్‌లలో వీరు పనిచేయనున్నారని తెలిపింది. దీంతో భారత్‌లోనూ ఉద్యోగాల వెల్లువ రాబోతుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. పూర్తి వివరాలివే..

  • Share this:
అమెరికన్ టెక్నాలజీ సంస్థ యూఎస్టీ.. ఈ సంవత్సరం కనీసం పదివేల మంది ఉద్యోగులను తీసుకోనున్నామని ప్రకటించింది. వివిధ దేశాల్లోని సంస్థ బ్రాంచ్‌లలో వీరు పనిచేయనున్నారని తెలిపింది. దీంతో భారత్‌లోనూ ఉద్యోగాల వెల్లువ రాబోతుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ పదివేలలో.. 2000 మంది ఎంట్రీ లెవల్ ఇంజినీర్లతో పాటు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, జావా, డేటా సైన్స్ అండ్ ఇంజినీరింగ్, అప్లికేషన్ డెవలప్ మెంట్ అండ్ మోడ్రనైజేషన్, ఏఐ, మెషీన్ లెర్నింగ్, ఆటోమేషన్ (RPA/IPA) వంటి రంగాల్లో ఉద్యోగాలు ఇవ్వనుందట. ఉత్తర, దక్షిణ అమెరికాలతో పాటు యూరప్, ఇండియా, ఇజ్రాయెల్, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని ఆ సంస్థ ప్రకటించింది. కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకునే వ్యక్తులు ఆ సంస్థ ఇప్పటికే ఉత్పత్తి చేస్తున్న అనేక వస్తువులు, ఇతర ప్లాట్ ఫాంల అభివృద్ధి కోసం పనిచేయాల్సి ఉంటుంది.

యూఎస్టీ సంస్థలో పనిచేయడం అంటే రోజూ కొత్త ఛాలెంజులను ఎదుర్కొంటూ కొత్త మార్పుల కోసం ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది అని ఆ సంస్థ సీఓఓ మను గోపీనాథ్ చెప్పారు. అయితే ఇలా ఉద్యోగాల్లోకి తీసుకునే వ్యక్తులనే కాదు.. తమ ఇతర ఉద్యోగులను కూడా ఇప్పుడప్పుడే ఆఫీసులకు పిలిపించే ఆలోచన లేదని సంస్థ ప్రకటించింది. యూఎస్టీ భారత్ లోని తమ పదిహేను వేల ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఇటీవలే వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా నిర్వహించింది. దీర్ఘకాలంలో కూడా అందరూ ఆఫీసు నుంచి పని చేయడం కాకుండా హైబ్రిడ్ పద్ధతిలో కొంతకాలం ఇంటి నుంచి మరికొంత కాలం ఆఫీసు నుంచి పనిచేసే పద్ధతిని కొనసాగించాలని ఆ సంస్థ కోరుతోంది.

టీసీఎస్, విప్రో వంటి సంస్థలు తమ ఉద్యోగులు ఎప్పటిలోపు ఆఫీసులకు తిరిగి రావాలని ఓ టైంలైన్ ప్రకటించిన నేపథ్యంలో యూఎస్టీ ప్రకటన ఉద్యోగులకు ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. అంతేకాదు.. కొత్త ఉద్యోగాల ప్రకటన ద్వారా కూడా భారత్‌లోని టెక్ వార్‌లో తామూ భాగమే అని ఈ సంస్థ వెల్లడించినట్లైంది. లక్షకు పైగా ఉద్యోగాలు అందిస్తామని ఇటీవలే కాగ్నిజెంట్ ప్రకటించింది. దీంతో చిన్న సంస్థలు కూడా తమ ఉద్యోగులకు హైక్స్, ఇతర బెనిఫిట్స్ అందిస్తూ వారిని ఉద్యోగాల్లో కొనసాగేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
Published by:Veera Babu
First published: