Home /News /jobs /

US UNIVERSITIES TEACHING US VARSITIES IN VIRTUAL POLICY AT LOCKDOWN INDIAN STUDENTS EXPERIENCES GH VB

US Universities: లాక్‌డౌన్‌లో వర్చువల్‌ విధానంలో యూఎస్‌ వర్సిటీల బోధన.. ఇండియన్ స్టూడెంట్స్ ఎక్స్‌పీరియన్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా సమయంలో యూనివర్సిటీలు, విద్యార్థులు సేఫ్టీ మెజర్స్‌, సోషల్‌ డిస్టేన్సింగ్‌, ట్రావెల్‌ రెస్ట్రిక్షన్స్‌ వంటివి ఎదుర్కొన్నారు. కొత్త నియమ నిబంధనలకు లోబడి కాలేజీలు పనిచేశాయి. ఈ ప్రభావం ట్రెడిషనల్‌ యూనివర్సిటీ ఎన్‌రోల్‌ సిస్టమ్‌ మీద కూడా కనిపించింది.

ఇంకా చదవండి ...
కరోనా(Corona) సమయంలో యూనివర్సిటీలు, విద్యార్థులు సేఫ్టీ మెజర్స్‌, సోషల్‌ డిస్టేన్సింగ్‌(Social Distancing), ట్రావెల్‌ రెస్ట్రిక్షన్స్‌(Travel Restrictions) వంటివి ఎదుర్కొన్నారు. కొత్త నియమ నిబంధనలకు లోబడి కాలేజీలు(Colleges) పనిచేశాయి. ఈ ప్రభావం ట్రెడిషనల్‌ యూనివర్సిటీ(University) ఎన్‌రోల్‌ సిస్టమ్‌ మీద కూడా కనిపించింది. విదేశాలలో హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ చదువుతున్న ఇంటర్నేషనల్‌ స్టూడెంట్స్‌ 2020 ప్రారంభంలో కరోనా(Corona) వ్యాప్తితో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. చాలా యూనివర్సిటీలు ఇన్‌పెర్సన్‌ లెర్నింగ్‌(Learning), ఇంటరాక్షన్‌ విత్‌ స్టూడెంట్స్‌, టీచర్స్‌(Teachers) విధానం నుంచి వర్చువల్ లెర్నింగ్ ఎన్‌విరాన్‌మెంట్‌లకు(learning Environment) మారాయి. మహమ్మారి వ్యాప్తి తీవ్రత పెరగడంతో యూనివర్సిటీల ఎన్‌రోల్‌మెంట్‌ సిస్టమ్‌, ఇంటర్నేషనల్‌ ట్రావెల్‌ రిక్వైర్‌మెంట్స్‌ కూడా మారాయి.

Btech-Mtech Students: బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేషనల్ హైవే అందిస్తున్న ఆఫర్ ఇదే..


కరికులమ్‌ రిక్వైర్‌మెంట్స్‌ కంటిన్యూ కావడానికి, అకడమిక్‌ సైకిల్‌ కొనసాగడానికి, పోస్ట్‌గ్రాడుయేట్‌ ఎంప్లాయ్‌మెంట్‌ సెర్చ్‌ కోసం యూనివర్సిటీలు, విద్యార్థులు కలిసి పనిచేశారు. మహమ్మారి సమయంలో ఎదురైన అనుభవాలను యునైటెడ్ స్టేట్స్‌లో చదువుతున్న నలుగురు భారతీయ విద్యార్థులు పంచుకున్నారు.

వర్చువల్ లెర్నింగ్‌కు మారడం
కుసుమ నాగరాజా భారతదేశంలో చాలా సంవత్సరాలు ఫ్యామిలీ లాయర్‌గా పనిచేశారు. మహమ్మారి కారణంగా మొదట్లో తన ఉన్నత విద్యా ప్రణాళికలను వాయిదా వేసుకున్నారు. ఆమె 2021లో తన మాస్టర్ ఆఫ్ లాస్ కోసం డేవిస్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చేరారు. బెంగళూరులోని తన ఇంట్లోనే ఉంటూ వర్చువల్‌గా తరగతులకు హాజరయ్యేందుకు అనుమతి పొందారు. కరోనా సమయంలో ఇండియా నుంచి యూఎస్‌కు ప్రయాణ, వీసా పరిమితులు ఉండటంతో వర్చువల్‌గా తరగతులకు హాజరైనట్లు చెప్పారు. మొదట్లో కొన్ని తరగతులను కోల్పోయినప్పటికీ, అవన్నీ రికార్డ్ అయి ఉండటంతో ఉపయోగపడ్డాయని తెలిపారు.

Dental Insurance: PNB మెట్‌లైఫ్ నుంచి కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్.. మొదటిసారి ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ లాంచ్..


ప్రథమ్ జాదవ్ 2020లో అయోవా స్టేట్ యూనివర్శిటీ (ISU)లో బిజినెస్ అనలిటిక్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని ప్రారంభించే ముందు ముంబైలోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్, సెయింట్ ఆండ్రూస్ కాలేజీలో చదువుకున్నారు. అతని తరగతులు అవసరాన్ని బట్టి ఇన్‌పర్సన్‌, వర్చువల్‌గా ఉండేవి. ల్యాబ్‌లు, కొన్ని ఇతర తరగతులు ఇన్‌ పెర్సన్‌గా ఉండేవి. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, విశ్వవిద్యాలయంలో సురక్షితమైన చర్యల్లో భాగంగా తరగతి గదులలో 50 శాతం సామర్థ్య నియమాన్ని అమలు చేశారని జాదవ్‌ చెప్పారు. జాదవ్‌కు కూడా చాలా మందిలాగే కొత్త వర్చువల్ ఎన్విరాన్‌మెంట్‌కు మారడానికి కొంత సమస్యను ఎదుర్కొన్నారు. అదే కోర్సు చదువుతున్న విద్యార్థులతో స్నేహం చేయడానికి కొంత సమయం పట్టిందని చెప్పారు.

జాదవ్ లాగా శివనా సక్సేనా మొదట్లో వర్చువల్ తరగతులకు అనుగుణంగా మారడం సవాలుగా భావించారు. 2021లో సెంట్రల్ వాషింగ్టన్ యూనివర్శిటీలో పబ్లిక్ హెల్త్‌లో గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. వర్చువల్ క్లాస్‌రూమ్ అనుభవం కొత్తదని, అయితే అన్ని టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్స్‌, జూమ్ వంటి అద్భుతమైన ప్లాట్‌ఫారమ్‌లతో సులువుగా అలవాటు పడ్డానని చెప్పారు. ప్రొఫెసర్లు చర్చలు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ల కోసం బ్రేక్‌అవుట్ రూమ్‌లను ఉపయోగించారని, చాలా ఉపయోగకరంగా ఉందని తెలిపారు. కోర్స్‌వర్క్ గురించి సందేహాలు వచ్చినప్పుడల్లా, ఇమెయిల్ ద్వారా ప్రొఫెసర్‌లను సంప్రదించానని చెప్పారు.

సోనాల్ సుస్సేన్ 2020లో యునైటెడ్ స్టేట్స్‌లో లాక్‌డౌన్‌లు విధించినప్పుడు, సౌత్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయం నుంచి సెల్, మాలిక్యులర్ బయాలజీలో బ్యాచిలర్ డిగ్రీని సగం వరకు పూర్తి చేశారు. ఎదురవుతున్న సవాళ్లకు అనుగుణంగా కోర్సును, సిలబస్‌ను పూర్తి చేయడానికి వీలుగా ప్రొఫెసర్‌లు మారడంతో సవాళ్లను అధిగమించగలిగినట్లు చెప్పారు.

Jobs in AP: తూర్పు గోదావ‌రి జిల్లాలో 57 కాంట్రాక్టు ఉద్యోగాలు..వేత‌నం రూ.32,000.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

విద్యార్థుల నమోదుకు అంతరాయం కలిగించడమే కాకుండా, తరగతులు షెడ్యూల్‌లో కొనసాగేలా, కొత్త వర్చువల్ లెర్నింగ్ వాతావరణానికి అనుగుణంగా విద్యార్థులు తగినంతగా నిమగ్నమై ఉండేలా చూసేందుకు విశ్వవిద్యాలయాలు కూడా ఆలోచించవలసి ఉంటుంది. వర్సిటీలు లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇంటరాక్టివ్‌గా మార్చడానికి వినూత్న మార్గాలతో ముందుకు వచ్చారని సుస్సేన్ చెప్పారు. జెనెటిక్స్ ల్యాబ్‌లో ఆన్‌లైన్ సిమ్యులేషన్‌లను చేసామని, ఆర్గానిక్ కెమిస్ట్రీ క్లాస్‌లో యాప్‌ను ఉపయోగించామని, విభిన్న అణువులను రూపొందించడానికి బంధాలను సృష్టించగలిగామని, విచ్ఛిన్నం చేయగలిగామని పేర్కొన్నారు.

ఆరోగ్యం, సామాజిక, మానసిక, శారీరక, పర్యావరణ అంశాలు జీవన నాణ్యతను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకున్న సక్సేనా తన విశ్వవిద్యాలయంలో క్లబ్‌లు, విద్యా కార్యక్రమాలలో పాల్గొనడానికి అదనపు ప్రయత్నం చేసింది. అంతర్జాతీయ ప్రోగ్రామ్ సలహాదారుల అద్భుతమైన బృందానికి, పబ్లిక్ హెల్త్ ఫ్యాకల్టీ మాస్టర్స్‌కు ధన్యవాదాలని ఆమె తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో చాలా మంది విద్యార్థులు ఆటంకాలు, సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, విశ్వవిద్యాలయ వనరులు, అధ్యాపకులు, సహచరులను అర్థం చేసుకోవడంతో యునైటెడ్ స్టేట్స్‌లో చదువును ఒక అమూల్యమైన అవకాశంగా మార్చుకున్నారు.

ఈ స్టోరీ మొదట స్పాన్ మ్యాగజైన్‌లో ప్రచురితమైంది.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Covid, University, Virtual classes

తదుపరి వార్తలు