హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

US Universities: యూఎస్‌లో ఉన్నత విద్య చదవాలని భావిస్తున్నారా..? బెస్ట్‌ వర్సిటీని ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.. 

US Universities: యూఎస్‌లో ఉన్నత విద్య చదవాలని భావిస్తున్నారా..? బెస్ట్‌ వర్సిటీని ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.. 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అమెరికా(America)లో ఉన్నత విద్య(Higher Education)ను అభ్యసించాలని భావించే విద్యార్థులకు సరైన యూనివర్సిటీని ఎంచుకోవడం సవాలుగా ఉంటుంది. ఎలాంటి వర్సిటీని ఎంచుకోవాలనే దానిపై పూర్వ విద్యార్థులు, అమెరికా యూనివర్సిటీల అధికారుల సూచనలు తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

అమెరికా(America)లో ఉన్నత విద్య(Higher Education)ను అభ్యసించాలని భావించే విద్యార్థులకు సరైన యూనివర్సిటీని(University) ఎంచుకోవడం సవాలుగా ఉంటుంది. ఎలాంటి వర్సిటీని ఎంచుకోవాలనే దానిపై పూర్వ విద్యార్థులు, అమెరికా(America) యూనివర్సిటీల అధికారుల సూచనలు తెలుసుకోండి.  యూఎస్‌ యూనివర్సిటీలను సెలక్ట్‌ చేసుకొనే సమయంలో లొకేషన్(Location), ఫండింగ్(Funding), క్లాస్ సైజ్, ఫ్యాకల్టీ(Faculty), క్యాంపస్ యాక్టివిటీస్, ప్లేస్‌మెంట్స్(Placements) వంటి అంశాలను ఇతర దేశాలకు చెందిన విద్యార్థులు పరిగణనలోకి తీసుకోవాలి. చాలా మంది విద్యార్థులు యూనివర్సిటీ(University)లకు దరఖాస్తు చేసే సమయంలో వర్సిటీ ర్యాంకింగ్‌లు(Rankings) లేదా బ్రాండ్(Brand) విలువపై ఎక్కువగా దృష్టి పెడతారు. ర్యాంకింగ్ అనేది ఒక సంస్థ మొత్తం విద్యా వాతావరణాన్ని అంచనా వేయడానికి ఒక మార్గం అయితే, అది ప్రాథమిక పరిశీలన కాకూడదు.

Application Avatar: హైస్కూల్ విద్యార్థులకు అలర్ట్.. స్ట్రాంగ్ అప్లికేషన్ అవతార్‌ను ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకోండి..


ఒకరికున్న అవసరాలు, కోరికలను సంబంధిత వర్సిటీ ఎంత వరకు తీరుస్తుందనేదానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. బర్కిలీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా(UC)లో ఇంటర్నేషనల్ టీమ్‌ మేనేజర్‌, సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ కామెరాన్ సదాఫీ మాట్లాడుతూ..‘తరచుగా యూఎస్‌ బర్కిలీ ర్యాంకింగ్‌ల గురించి విద్యార్థులు ఉత్సాహంగా ఉండటం నేను చూస్తున్నాను. ఇది అత్యుత్తమంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ విద్యార్థి, వారి కుటుంబం అవసరాలను యూనివర్సిటీ ఎంత వరకు తీరుస్తాయి అనే దానికి ప్రాధాన్యం ఇవ్వాలి’ అన్నారు.

అకడమిక్, సోషల్, ఎన్విరాన్మెంటల్, ఫైనాన్షియల్, ప్రొఫెషనల్ అంశాలకు సంబంధించి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని సదాఫీ సూచించారు. ర్యాంకింగ్‌ కంటే కూడా వ్యక్తిగత అవసరాలను తీర్చే వర్సిటీలు ఉత్తమమని, కాబట్టి కళాశాల, వర్సిటీని ఎన్నుకునేటప్పుడు వ్యక్తిగత విజయానికి సరిపోయే వాటిని గుర్తించడం ముఖ్యమని, వర్సిటీ ఏమి ఆఫర్ చేస్తుందో, అందించగలదో తెలుసుకోవడం ప్రధానమని సదాఫీ వివరించారు.

యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిగ్రీలను అందించే దాదాపు 4,000 కాలేజ్‌ల లిస్ట్‌ను ప్రకటిస్తుంది. విద్యార్థి అవసరాలకు సరిపోయే వర్సిటీ కోసం అన్వేషణ చాలా ఎక్కువగా ఉంటుంది. వర్జీనియా టెక్‌లో ఇంటర్నేషనల్‌ అడ్మిషన్స్‌ అసిస్టెంట్ డైరెక్టర్ టైలర్ ఆక్స్లీ మాట్లాడుతూ..‘యునైటెడ్ స్టేట్స్‌లోని వివిధ ప్రాంతాలలో వివిధ రకాల యూనివర్సిటీలు ఉన్నాయని తెలుసుకోవాలి. పెద్ద నగరాల, చిన్న పట్టణాలలో కూడా రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌లు, చిన్న స్కూల్స్‌ కూడా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులకు ఎలాంటి వర్సిటీని వెతుకుతున్నామనే అంశంపై స్పష్టత ఉండాలి. వారికి ఏం కావాలి? వారి ప్రమాణాలకు సరిపోయే ప్రోగ్రామ్‌లను ఏ వర్సిటీ అందిస్తోంది చూసుకోవాలి’ అని సూచించారు.

US Universities: ఇండియన్ స్టూడెంట్స్‌కు యూఎస్ వర్సిటీల్లో మంచి అవకాశాలు.. విద్యార్థులు ఈ విషయాలను తెలుసుకోండి..


యూనివర్సిటీని సెలక్ట్‌ చేసుకొనేందుకు మార్గాలువిద్యార్థులు యూనివర్సిటీని ఎంచుకొనేందుకు, వారి అవసరాలను గుర్తించడానికి వివిధ విధానాలను పాటించవచ్చు. 2009లో యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా నుంచి ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీని అందుకున్న నైమిష్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ..‘జీవితంలో ఏం చేయాలని అనుకొంటున్నారు. అందుకు ఏం చదవాలి? అనే అంశాలపై లోతుగా ఆలోచించాను. నా వీసా ఇంటర్వ్యూలో నన్ను అడిగిన ప్రశ్న కూడా అదే.  ఏం కావాలనే దానిపై స్పష్టత ఉంటే, అది కచ్చితంగా సహాయం చేస్తుంది.’ అని చెప్పారు.

పరిశోధన చేయండిచాలా మంది విద్యార్థులు దరఖాస్తు చేయాలనుకుంటున్న వర్సిటీల గురించి తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తారు. 2019లో మేరీల్యాండ్ వర్సిటీ నుంచి బిజినెస్ అనలిటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీని అందుకున్న ఈశ్వర్ శేషాద్రి మాట్లాడుతూ.. ‘గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ నుంచి ఏమి కోరుకొంటున్నారో స్పష్టంగా అర్థం చేసుకోవడం మొదటి దశ. నేను ఈ అంశంలో కొంచెం ముందుగానే రీసెర్చి ప్రారంభించాను. నేను ఏది ఇష్టపడతాను, నేనే ఏం చేయలేను? అనే అంశాలపై కొంచెం స్పష్టత ఉంది.’ అని చెప్పారు. రెండో దశలో విశ్వవిద్యాలయంలోని ప్రోగ్రామ్ ఈ ఫ్రేమ్‌వర్క్‌కి ఎలా సరిపోతుందో అర్థం చేసుకోవాలని శేషాద్రి తెలిపారు. ఉదాహరణకు ఒక నిర్దిష్ట వర్సిటీలో అనలిటిక్స్ ప్రోగ్రామ్ టెక్నికల్ ఎక్స్‌పోజర్ వైపు ఎక్కువ మొగ్గు చూపవచ్చు, అదే పేరుతో ఉన్న ప్రోగ్రామ్ పూర్తిగా వ్యాపారాన్ని వేరే చోట కేంద్రీకరించవచ్చు’ అని శేషాద్రి తెలిపారు.

ఈ స్టోరీ మొదట స్పాన్ మ్యాగజైన్‌లో ప్రచురితమైంది.

First published:

Tags: Career and Courses, New courses, Students, University, USA

ఉత్తమ కథలు