US UNIVERSITIES COURSES US VARSITIES OFFERING ONLINE COURSES OPPORTUNITY TO GET A DEGREE FROM HOME GH VB
Online Courses from US:: ఆన్లైన్ కోర్సులు అందిస్తున్న యూనివర్సిటీలు.. ఇంటి నుంచే డిగ్రీ పొందే అవకాశం..
ప్రతీకాత్మక చిత్రం
కొన్ని టాప్ యూఎస్ యూనివర్సిటీలు డేటా అనలిటిక్స్ నుంచి డిజిటల్ మార్కెటింగ్ వరకు ఆన్లైన్లో లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ అందిస్తున్నాయి. దీంతో ఇంట్లో నుంచే యూఎస్ కళాశాలల డిగ్రీని పొందే అవకాశం ఉంది.
ప్రపంచ దేశాల విద్యార్థులు చాలామంది ఉన్నత విద్య కోసం అమెరికా(America) వెళ్తారనే విషయం తెలిసిందే. అయితే కరోనా(Corona) మహమ్మారి కారణంగా అమెరికా వెళ్లలేక చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి విద్యార్థులు ఆన్లైన్ ద్వారా యూఎస్ వర్సిటీల్లో(US Varsity) కోర్సులు(Courses) చేసే అవకాశం ఉంది. కొన్ని టాప్ యూఎస్ యూనివర్సిటీలు డేటా అనలిటిక్స్ (Analytics) నుంచి డిజిటల్ మార్కెటింగ్(Digital Marketing) వరకు ఆన్లైన్లో లాంగ్ టర్మ్,(Long Term) షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్(Short term Programmes) అందిస్తున్నాయి. దీంతో ఇంట్లో నుంచే యూఎస్ కళాశాలల డిగ్రీని పొందే అవకాశం ఉంది.
* ఫిన్‌టెక్ ఆన్లైన్ షార్ట్ కోర్స్ : హార్వర్డ్ బిజినెస్ స్కూల్
ఈ ఆన్లైన్ షార్ట్ కోర్స్ ఆన్-క్యాంపస్ ప్రోగ్రామ్‌లలో ఉపయోగించే కేస్ మెథడ్ అప్రోచ్‌కు అనుగుణంగా ఉంటుంది. ఫిన్‌టెక్ ల్యాండ్‌స్కేప్ కాంప్లెక్స్, డైనమిక్ ననేచర్ను రిఫ్లెక్ట్ చేసే నిజ జీవిత సవాళ్లను ఇది అందిస్తుంది. కోర్సు ముగింపులో అభ్యర్థులు ఆర్థిక సాంకేతిక రంగంలో ట్రాన్స్ఫర్మేటివ్ ఇనిషియేటివ్స్ తీసుకురాగల సామర్థ్యం పొందుతారు. ఈ ఆన్లైన్ కోర్సు ఆర్థిక నిపుణులు, బిజినెస్ లీడర్స్, సీనియర్ మేనేజ్మెంట్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఫిన్‌టెక్ వ్యవస్థాపకుల కోసం రూపొందించారు. కోర్సు edXలో రూ.2,13,485కి లభిస్తుంది.
* మోడర్న్ రోబోటిక్స్, కోర్స్ 1: ఫౌండేషన్ ఆఫ్రోబోట్ మోషన్- నార్త్ వెస్ట్రన్ యయూనివర్సిటీ
ఇందులో ఆరు చిన్న కోర్సులు ఉంటాయి. రోబోటిక్స్ రంగంలో పని చేయాలనుకునే లేదా అడ్వాన్స్డ్ రీసెర్చ్ చేయాలనుకొనే విద్యార్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఫౌండేషన్ ఆఫ్ రోబో మోషన్, రోబో కాన్ఫిగరేషన్లకు సంబంధించిన ప్రాథమిక అంశాలు, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, సి-స్పేస్ టోపోలాజీ మొదలైన అంశాలను కలిగి ఉంటుంది. Courseraలో అందుబాటులో ఉంది, ఇది పూర్తి చేయడానికి 24 గంటలు పడుతుంది.
* ఇంట్రడక్షన్ ఆఫ్ నెట్వర్క్: న్యూయార్క్ యూనివర్సిటీ
కోర్సు అంశాలలో కంప్యూటర్ నెట్వర్కింగ్, అప్లికేషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ అండ్ లింక్ లేయర్, నెట్వర్క్ సెక్యూరిటీ ఉన్నాయి. అభ్యర్థులు కంప్యూటర్ నెట్‌వర్క్‌లను వివరించడం, నెట్‌వర్క్‌లలోని కీలక భాగాలను గుర్తించడం, నెట్వర్కింగ్ అప్లికేషన్ల సూత్రాలు, HTTP, SMTP, FTP వంటి ప్రోటోకాల్‌ల గురించి చర్చించడం, పీర్ టు పీర్ నెట్‌వర్క్‌లు, రూటర్లు ఎలా పని చేస్తాయి, IP ప్రోటోకాల్ మొదలైనవాటిని తెలుసుకొంటారు. edXలో రూ. 11,362కి కోర్సు లభిస్తుంది.
* యాక్సిలరేటెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్: యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్
ఈ కోర్సు ద్వారా కాంప్లెక్స్ బిజినెస్ ఛాలెంజెస్ను పరిష్కరించడానికి విద్యార్థులు కోర్ మేనేజ్మెంట్ నైపుణ్యాలను పొందుతారు. edXలో రూ. 266,856తో కోర్సును పొందే అవకాశం ఉంది. 8 వారాల కోర్సు ద్వారా వ్యాపారాన్ని మరింత ప్రభావవంతంగా నిర్వహించడానికి ప్రధాన నైపుణ్యాలు పొందుతారు. అధికారిక వెబ్సైట్ ప్రకారం.. మోడర్న్ బిజినెస్, ఆర్గనైజేషనల్ ఫంక్షన్స్‌పై పట్టు సాధిస్తారు.
* క్రిప్టోకరెన్సీ: మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
ఈ 6 వారాల కోర్సు ద్వారా అభ్యర్థులు క్రిప్టో ప్రాజెక్ట్‌లను అర్థం చేసుకొనే సామర్థ్యం, ఎవల్యూషన్ ఆఫ్ మనీకి సంబంధించి అవకాశాలను అందుకొనే నైపుణ్యాలను పొందుతారు. అభ్యర్థులు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, స్మార్ట్ కాంట్రాక్ట్‌లు, వికేంద్రీకృత అప్లికేషన్లు (DApps), క్రిప్టోకరెన్సీలు ఉన్న విస్తృత వాతావరణంపై పట్టు సాధిస్తారు. ఈ కోర్సు edXలో రూ.213,485కి అందుబాటులో ఉంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.