Home /News /jobs /

US GRADUATE STUDY WHAT ARE THE BENEFITS OF GRADUATE COURSES IN THE US HERE ARE THE THINGS STUDENTS NEED TO KNOW GH VB

US Graduate Study: యూఎస్‌లో గ్రాడ్యుయేట్ కోర్సులతో ఎన్నో ప్రయోజనాలు.. విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యూఎస్ యూనివర్సిటీలలో (US University) గ్రాడ్యుయేట్-లెవెల్ స్టడీ (Graduate Level Study) కేవలం కోర్స్‌వర్క్, పరిశోధన వరకు మాత్రమే పరిమితం కాదు. ఈ స్టడీ కొత్త అనుభవాలు అందించడంతో పాటు మీ గురించి మీరు తెలుసుకునేలా చేస్తుంది.

యూఎస్ యూనివర్సిటీలలో (US University) గ్రాడ్యుయేట్-లెవెల్ స్టడీ (Graduate Level Study) కేవలం కోర్స్‌వర్క్, పరిశోధన వరకు మాత్రమే పరిమితం కాదు. ఈ స్టడీ కొత్త అనుభవాలు అందించడంతో పాటు మీ గురించి మీరు తెలుసుకునేలా చేస్తుంది. సాధారణంగా అమెరికన్ అకడమిక్ డిగ్రీ (American Academic Degree) మెరుగైన కెరీర్ అవకాశాలు, ఉద్యోగ భద్రత కల్పిస్తుంది. అలాగే విద్యార్థులు తమ గురించి తాము ఎక్కువగా నేర్చుకునేలా, తామేవరో తెలుసుకునేలా యూఎస్ గ్రాడ్యుయేట్ లెవెల్ స్టడీ ఉపయోగపడుతుంది. యూఎస్ క్యాంపస్‌లోని వివిధ రకాల వృత్తిపరమైన, విద్యాపరమైన అవకాశాలు, సాంస్కృతిక వైవిధ్యం ఒక చక్కటి వ్యక్తిగా ఎదగడానికి స్టూడెంట్స్‌కు సహాయపడుతాయి. డైవర్సిటీ, ఇన్‌క్లూజన్‌తో పాటు ఈక్విటీ గురించి నేర్చుకోవడంలో క్యాంపస్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. యునైటెడ్ స్టేట్స్‌లోని సాంస్కృతిక వైవిధ్యం (Cultural Diversity) మరెక్కడా లేనంత గొప్పగా ఉంటుంది.

Btech-Mtech Students: బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేషనల్ హైవే అందిస్తున్న ఆఫర్ ఇదే..


ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన ప్రజల మధ్య నివసిస్తున్నప్పుడు కేవలం విద్యాపరమైన విషయాలే కాకుండా మరెన్నో విషయాలు తెలుసుకోవడం సాధ్యమవుతుంది. అయితే ఇక్కడి గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో కొందరు కోర్స్ వర్క్, రీసెర్చ్ విషయాల కంటే ఎక్కువగా నేర్చుకోలేరు. మరికొందరు కేవలం ఇతర విషయాలను మాత్రమే నేర్చుకోగలుగుతారు. కొందరు మాత్రం వ్యక్తిగతంగా ఎంతో ఎదుగుతారు. అయితే ఇక్కడ చేరే విద్యార్థులు డిగ్రీతో పాటు ఇంకా ఏం నేర్చుకోవాలి అనేది ముందుగానే నిర్ణయించుకోవాలి. విద్యార్థులకు కావలసినంత నాలెడ్జ్ యూఎస్ యూనివర్సిటీలు అందించగలవు.

ఇక్కడ అందించే పలు రకాల కోర్సులలో పాల్గొని అమెరికా ప్రజల జీవన విధానం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన పొందొచ్చు. వాలంటీర్‌గా చేరి మరిన్ని ముఖ్య విషయాలను తెలుసుకోవచ్చు. అలాగే స్థానికంగా జరుపుకునే పండుగలలో పాల్గొంటూ రకరకాల జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. యునైటెడ్ స్టేట్స్‌లో ఇంటర్నేషనల్ స్టూడెంట్‌గా ఇంకా ఎక్కువగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఎంత ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే అంత ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించవచ్చు.

Dental Insurance: PNB మెట్‌లైఫ్ నుంచి కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్.. మొదటిసారి ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ లాంచ్..


అయితే యూఎస్‌లో చదువుకునే కొందరికి లైఫ్ అంత ఈజీ కాకపోవచ్చు. ముఖ్యంగా ఫుడ్ విషయంలో ఇంటి దగ్గర ఉన్నంత సౌకర్యాలు లభించకపోవచ్చు. అయితే యూఎస్ యూనివర్సిటీ విద్యార్థుల జీవితంలో ప్రధాన భాగమవుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. యూనివర్సిటీ, యూనివర్సిటీలోని ప్రజలు చాలా నేర్పిస్తారు. అలాగే మీరు ఎవరో మీకు తెలిసేలా చేస్తారు. కొన్నేళ్ల కాలం పాటు కష్టతరమైన సమయాలు ఎదురైనప్పటికీ చివరికి గొప్ప ప్రతిఫలం దక్కుతుంది. కాబట్టి, మీరు యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లినప్పుడు అన్ని ప్రదేశాలు విషయాల కోసం అన్వేషించాలి! ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. యునైటెడ్ స్టేట్స్‌లో విద్యార్థి జీవితం మీరు ఎప్పటికీ ఊహించని అనుభూతిని అందిస్తుంది. అలాగే ఇక్కడ నేర్చుకున్న విషయాలు మిమ్మల్ని జీవితంలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి. మీరు ఎన్నడూ చేయని పనులను చేసేలా సన్నద్ధం చేస్తాయి.

ఈ స్టోరీ మొదట స్పాన్ మ్యాగజైన్‌లో ప్రచురితమైంది.
Published by:Veera Babu
First published:

Tags: America, Career and Courses, Post graduates, Students

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు