US BASED UNIVERSITY IS OFFERING 100000 WORTH SCHOLARSHIP FOR FOREIGN STUDENTS APPLYING FOR UG COURSES GH VB
Scholarship: విద్యార్థులకు లక్ష డాలర్ల స్కాలర్షిప్.. ప్రకటించిన ఆ యూనివర్సిటీ.. ఎవరు అర్హులంటే..
ప్రతీకాత్మక చిత్రం
అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరేవారికి గుడ్ న్యూస్ చెప్పింది అమెరికాకు చెందిన అగస్టానా యూనివర్సిటీ (Augustana University). తమ యూనివర్సిటీ ఆఫర్ చేస్తోన్న యూజీ ప్రోగ్రామ్‌లలో చేరే విదేశీ విద్యార్థులకు ఏటా 25 వేల యూఎస్ డాలర్స్ వరకు స్కాలర్షిప్ (scholarships)లను అందిస్తామని ప్రకటించింది.
అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరేవారికి గుడ్ న్యూస్ చెప్పింది అమెరికాకు చెందిన అగస్టానా యూనివర్సిటీ (Augustana University). తమ యూనివర్సిటీ ఆఫర్ చేస్తోన్న యూజీ ప్రోగ్రామ్‌లలో చేరే విదేశీ విద్యార్థులకు ఏటా 25 వేల యూఎస్ డాలర్స్ వరకు స్కాలర్షిప్ (scholarships)లను అందిస్తామని ప్రకటించింది. అగస్టానా యూనివర్సిటీలో 2022 నుంచి ప్రారంభమయ్యే యూజీ కోర్సుల్లో జాయిన్ అయ్యేవారు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ద్వారా భారతీయ విద్యార్థులతోపాటు యంగ్ ప్రొఫెషనల్స్.. బిజినెస్, కంప్యూటర్ సైన్సెస్, ఫైకాలజీ (phycology-algae science), మ్యాథ్స్, అకౌంటింగ్ మొదలైన వాటిలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు పూర్తి చేయడానికి నాలుగేళ్లలో 1,00,000 డాలర్ల వరకు స్కాలర్షిప్లు పొందవచ్చు. స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 1 అని అగస్టానా యూనివర్సిటీ వెల్లడించింది.
సౌత్ డకోటాలోని సియోక్స్ ఫాల్స్ లో అగస్టానా యూనివర్సిటీ ఉంటుంది. ఈ యూనివర్సిటీ ప్రకారం, దరఖాస్తుదారులు తప్పనిసరిగా శాట్ (SAT) ఇంగ్లీష్ లో 500 స్కోర్ లేదా ఐఈఎల్టీఎస్ (IELTS)లో 6.0 స్కోర్ లేదా అంతకన్నా ఎక్కువ కలిగి ఉండాలి. అలాగే గ్రేడ్ పాయింట్ యావరేజ్ (GPA) 6.0 కలిగి ఉండాలి. అంతేకాదు కనీసం 15,000 డాలర్ల స్కాలర్షిప్ కోసం అర్హత సాధించడానికి ఒక ఎస్సే (essay) లేదా వ్యాసాన్ని కూడా సమర్పించాలి. స్కాలర్షిప్ అనేది 10, 12 తరగతుల్లో కనీసం 75 శాతం మార్కుల సగటు స్కోర్‌తో, ఐఈఎల్టీఎస్ (IELTS)లో 7.0 స్కోర్‌తో 25 వేల డాలర్ల వరకు పెరుగుతుంది.
అగస్టానా యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, డేటా సైన్స్, వ్యాపారంలో అనేక రంగాలు, హార్డ్ సైన్సెస్ లాంటి అనేక అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. లిబరల్ ఆర్ట్స్ అప్రోచ్ తో విద్యార్థులు తమ టెక్నికల్ స్కిల్స్ తో పాటు అద్భుతమైన క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్, ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ పెంచుకునేలా యూనివర్సిటీ ట్రైనింగ్ ఇస్తుంది.
అగస్టానా యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ అండ్ ఎన్రోల్మెంట్ డైరెక్టర్ అయిన బెన్ ఐవర్సన్ స్కాలర్షిప్స్, విదేశీ విద్యార్థుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ కరోనా మహమ్మారి సమయంలో కూడా అమెరికాలో చదువుకోవాలని ఆసక్తి చూపించే దక్షిణాసియా దరఖాస్తుదారుల సంఖ్య పెరిగింది. భారతీయ విద్యార్థుల అకడమిక్ ప్రిపరేషన్, క్యాంపస్‌లో అకడమిక్ అచీవ్మెంట్, అలాగే మా క్యాంపస్ కమ్యూనిటీకి వారి సహకారం పట్ల మేం మంత్రముగ్ధులవుతున్నాం. పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం అని అనిపించింది.
సమీప భవిష్యత్తులో మా స్నేహపూర్వక, సురక్షితమైన, విద్యాపరంగా సమర్థవంతమైన క్యాంపస్‌కు మరింత మంది భారతీయ విద్యార్థులను స్వాగతించడానికి మేం ఎదురుచూస్తున్నాం" అని బెన్ ఐవర్సన్ పేర్కొన్నారు. 2022 స్ప్రింగ్ కోసం ఇప్పటికే అడ్మిషన్ తీసుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను కూడా ఆయన వెల్లడించారు. "2022 స్ప్రింగ్ లో 50 దేశాల నుంచి సుమారు 150 మంది అంతర్జాతీయ విద్యార్థులు అగస్టానాకు హాజరవుతారు. వారిలో దాదాపు 5 శాతం మంది భారతీయులు ఉంటారు." అని ఐవర్సన్ పేర్కొన్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.