Home /News /jobs /

US BASED B SCHOOL OFFERS COURSE IN DESIGN THINKING INNOVATION FOR INDIAN PROFESSIONALS GH VB

Professional Courses: వారి కోసం అమెరికన్ బి-స్కూల్ తీపి కబురు.. నాలుగు నెలలకు కొత్త కోర్సు.. వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డిజైన్ థింకింగ్, ఇన్నోవేషన్‌లో ప్రావీణ్యం పొందాలనుకునే ఇండియన్ ప్రొఫెషనల్స్‌కు ఓ అమెరికన్ బిజినెస్ స్కూల్ (US-based B-School) తీపి కబురు అందించింది. అమెరికాలోని యుమాస్ అమ్హెర్స్ట్‌ (Amherst)లో ఉన్న ఐసెన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (Isenberg school of management) డిజైన్ థింకింగ్, ఇన్నోవేషన్‌లో ఓ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ను తాజాగా లాంచ్ చేసింది.

ఇంకా చదవండి ...
డిజైన్ థింకింగ్, ఇన్నోవేషన్‌లో ప్రావీణ్యం పొందాలనుకునే ఇండియన్ ప్రొఫెషనల్స్‌కు ఓ అమెరికన్ బిజినెస్ స్కూల్ (US-based B-School) తీపి కబురు అందించింది. అమెరికాలోని యుమాస్ అమ్హెర్స్ట్‌ (Amherst)లో ఉన్న ఐసెన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (Isenberg school of management) డిజైన్ థింకింగ్, ఇన్నోవేషన్‌లో ఓ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ను తాజాగా లాంచ్ చేసింది. ఈ కోర్సు పార్టిసిపెంట్లకు తమ డిజైన్ థింకింగ్‌ను ఒక స్ట్రాటజిక్ బిజినెస్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ టూల్ గా మార్చుకునేందుకు దోహదపడుతుంది. ఈ కోర్సు వ్యవధి నాలుగు నెలలు కాగా, ఈ సమయంలో డిజైన్ థింకింగ్‌లో పార్టిసిపెంట్లు నిష్ణాతులు అవుతారు. ప్రోడక్ట్, గ్రోత్, మార్కెటింగ్ మేనేజర్‌లు, ప్రొడక్ట్ హెడ్‌లు, కన్సల్టెంట్‌లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌లు వంటి ఇండియన్ సీనియర్ ప్రొఫెషనల్‌ల కోసం ఈ ప్రోగ్రామ్‌ను ఐసెన్‌బర్గ్ స్కూల్ తీసుకొచ్చింది.

Fact Check: గేట్–2022 ఎగ్జామ్​ నిజంగానే వాయిదా పడిందా..? వైరల్​ అవుతున్న వార్తల్లో నిజమెంత..? తెలుసుకోండి..


ఈ కొత్త కోర్సును సింప్లిలెర్న్ (Simpilearn), ఈవై (EY) లెర్నింగ్ సొల్యూషన్స్ సహకారంతో బిజినెస్ స్కూల్ పరిచయం చేసింది. ఇందులో కస్టమర్ డిజైరబిలిటీ (customer desirability), బిజినెస్ వయబిలిటీ (business viability), టెక్నాలజీ ఫీసబిలిటీ (technology feasibility)లను ఏకీకృతం చేసే డిస్రప్టివ్ సొల్యూషన్స్ (disruptive solutions) కనుగొనడం కూడా పార్టిసిపెంట్లు నేర్చుకుంటారు. ఐసెన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్... పార్టిసిపెంట్లకు UMass Amherst పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ సర్టిఫికేట్, పూర్వ విద్యార్థుల సభ్యత్వం (alumni membership), నెలవారీ మాస్టర్‌క్లాస్ తోపాటు UMass Amherst Isenberg ఆన్‌లైన్ ఎంబీఏకి 3 క్రెడిట్‌లను అందజేస్తుంది. ఈ ప్రోగ్రామ్ లో నాలెడ్జ్ పార్టనర్‌గా ఉన్న ఈవై లెర్నింగ్ సొల్యూషన్స్ అనేది క్యాప్‌స్టోన్, మాస్టర్ క్లాస్‌లతో సహా 50 శాతానికి పైగా లైవ్ క్లాస్ డెలివరీని అందిస్తుంది.

ఈ ప్రోగ్రామ్‌లో లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు, ఈవై నిపుణులు అందించే క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్, ఐసెన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లోని టాప్ ఫ్యాకల్టీ మాస్టర్‌క్లాస్‌లను యాక్సెస్ చేయవచ్చు. అంతేకాదు, వర్క్ ప్లేస్‌లో ఇంప్లిమెంట్ చేస్తూ బిజినెస్ ప్రాబ్లమ్స్ ను వేగంగా సాల్వ్ చేసేందుకు వీలుగా 25కి పైగా ఇన్నోవేటివ్ ప్రాక్టికల్ టెంప్లేట్‌లు పొందొచ్చు. హార్వర్డ్ బిజినెస్ పబ్లిషింగ్ కేస్ స్టడీస్ ద్వారా ఇంటరాక్టివ్ పీర్ లెర్నింగ్, సారా బ్లేక్లీ, టిమ్ బ్రౌన్ నుంచి LevelUp సెషన్‌లు, రియల్ లైఫ్ ప్రాజెక్ట్‌లను కూడా ఈ కోర్సు ఆఫర్ చేస్తోంది. కోర్సును పూర్తి చేసిన తర్వాత పార్టిసిపెంట్లు UMass అమ్హెర్స్ట్ ఇసెన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి జాయింట్ UMass అమ్హెర్స్ట్-సింప్లిలెర్న్ కంప్లీషన్ సర్టిఫికేట్, పూర్వ విద్యార్థుల సభ్యత్వాన్ని అందుకుంటారు.

RRB NTPC CBT-2: ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ సీబీటీ–2 పరీక్ష తేదీలు విడుదల.. ఎగ్జామ్​​ షెడ్యూల్‌ను పరీశీలించండి..


ఈ కోర్సు గురించి సింప్లిలేర్న్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ ఆనంద్ నారాయణన్ మాట్లాడుతూ, “డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు సరైన నైపుణ్యాలతో పార్టిసిపెంట్లను సన్నద్ధం చేయడానికి రూపొందించాం. ఇందుకోసం మా భాగస్వాములైన ఐసెన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ఈవైలతో కలిసి పని చేస్తున్నందుకు సంతోషిస్తున్నాం." అని పేర్కొన్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు