• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • URBAN COMPANY PLANS TO RECRUIT 20 000 SERVICE PROFESSIONALS THIS YEAR NS GH

Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది ఆ కంపెనీలో 20 వేల నూతన నియామకాలు.. వివరాలివే

Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది ఆ కంపెనీలో 20 వేల నూతన నియామకాలు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది 20 వేల నియామకాలను చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
కరోనా లాక్ డౌన్ వల్ల అన్ని వ్యాపారాలు మూతబడి ఇప్పుడిప్పుడే తిరిగి సాధారణ పరిస్థితికి చేరకుంటున్నాయి. ప్రస్తుతం సేవల రంగంలో డిమాండ్ ఎక్కువగా ఉంది. అందుకే సేవల రంగంలో మరింత వృద్ధిని సాధించే లక్ష్యంతో ముందుకెళ్తోంది అర్బన్ కంపెనీ.. గతంలో అర్బన్ క్లాప్ గా పిలిచిన ఈ కంపెనీ ఇంటికి సంబంధించిన సేవలు, బ్యూటీ, స్టైలింగ్ వంటి వాటిని ఆన్ లైన్ లో బుక్ చేసుకునే అవకాశాన్ని అందిస్తూ వారికి సేవలను అందిస్తోంది. తన సేవలను మరింత విస్తరించే ఉద్దేశంతో కంపెనీ మరో 20 వేల మంది నిపుణులను నియమించుకోవడానికి సిద్ధంగా ఉందని ఆ సంస్థ తెలియజేసింది. ప్రస్తుతం ఈ కంపెనీలో 40 వేల మంది గిగ్ వర్కర్లు(ఆన్ లైన్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు)ను కలిగి ఉంది. వారిలో 35 వేల మంది భారత్ లోనే ఉన్నారు. ఇందులో మూడింట ఓ వంతు మంది మహిళలు బ్యూటీషయన్లు, మసాజ్ థెరపిస్టులుగా పనిచేస్తున్నారని అర్బన్ కంపెనీ సహా వ్యవస్థాపకులు వరుణ్ ఖైతాన్ చెప్పారు. "2021 వ్యాపార వృద్ధి ప్రణాళికకు అనుగుణంగా మేము ఎక్కువ మంది సేవా నిపుణులను ఆన్ బోర్డ్ చేసి మరింత వేగవంతం చేయాలని అనుకుంటున్నాం. 2021 వ్యూహానికి అనుగుణంగానే మా ప్లాట్ ఫాంలో 50 శాతానికి పైగా గిగ్ కార్మికులను ఆన్ బోర్డ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం" అని వరుణ్ చెప్పారు.

ఈ ఏడాది వేసవి సీజన్ ప్రారంభానికి ముందే 10 వేల మంది ఏసీ టెక్నిషియన్లను కంపెనీ నియమించుకుందని ఖైతాన్ తెలిపారు. వచ్చే రెండు, మూడు నెలల్లో 3 మిలియన్ల ఏసీల్లో 1.5 మిలియన్ల ఏసీ సేవలను అందించేందుకు యోచిస్తున్నామని ఆయన చెప్పారు. గత కొన్ని నెలలుగా భోపాల్, కోయంబత్తూర్, కొచ్చి, కాన్పూర్, వారణాసి, ఆగ్రా, గౌహాతి వంటి నగరాల్లో కూడా కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించిందని, మార్చి-ఏప్రిల్ నెలల్లో అర్బన్ కంపెనీ మరికొన్ని నగరాల్లో కార్యకాలపాలను విస్తృతం చేసేందుకు చూస్తున్నామని వరుణ్ ఖైతాన్ వెల్లడించారు.

గిగ్ మోడల్, గిగ్ కార్మికులకు వినియోగదారులకు నాణ్యమైన అనుభూతిని అందించడమే తమ లక్ష్యం అని చెప్పారు. ఈ మోడల్ ద్వారా సంప్రదాయ పరిశ్రమ సెటప్ లో తమ ప్రత్యర్థుల కంటే ఎక్కవ సంపాదించగులుగుతామని, వచ్చే ఐదేళ్లలో ఓ మిలియన్ మైక్రో పారిశ్రామిక వేత్తలను సృష్టించే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. తమ సేవా నిపుణులకు శిక్షణ ఇవ్వడంపై కూడా విస్తృతంగా దృష్టి సారిస్తున్నామని చెప్పారు. తాము నెలకు 3 వేల నుంచి 5 వేల మంది నిపుణులకు శిక్షణ ఇస్తూ.. 200 మందికి పైగా పూర్తి శిక్షకులతో కూడిన అంతర్గత బృందాన్ని నిర్మించినట్లు ఆయన చెప్పారు. ముఖ్యంగా నైపుణ్యాలపై దృష్టి పెడతామని, వారు ఈ శిక్షణ కోసం ఒక్కో చోట వారం నుంచి రెండు నెలల వరకు ఉంటారని చెప్పారు.

మార్చి 2020కి ముందు తమ సంస్థ శిక్షణా కేంద్రాల్లో నిపుణులను దేశవ్యాప్తంగా వ్యాపింప జేసిందని, అయితే కరోనా కారణంగా లాక్డౌన్ తో శిక్షణను ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తున్నామని వరుణ్ ఖైతాన్ తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలకు అనుగుణంగా బ్యాకెండ్ మౌలిక సదుపాయాలతో తమ టెక్ బృందానికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా పరిశుభ్రతపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. పరిస్థితి సాధారణ స్థాయికి వచ్చిన తర్వాత భౌతికంగా సుమారు 100 శిక్షణ తరగతులును దేశవ్యాప్తంగా ప్రారంభిస్తామని ఆయన అన్నారు. రిమోట్ గా పనిచేసేవారికి వర్చువల్ గా ట్రైనింగ్ ఇవ్డవడం కొనసాగిస్తుందని తెలిపారు.
Published by:Nikhil Kumar S
First published: