UPSSSC చక్బందీ లెక్పాల్ రిక్రూట్‌మెంట్ : 1,364 జాబ్స్... ఇంటర్వ్యూ లేకుండా సెలక్షన్స్... ఇలా అప్లై చేసుకోండి

Chakbandi Lekhpal Recruitment 2019: ఉత్తరప్రదేశ్ నుంచీ చక్కటి ఉద్యోగ అవకాశాల ప్రకటన వచ్చింది. ఎలా అప్లై చెయ్యాలో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: March 11, 2019, 7:49 AM IST
UPSSSC చక్బందీ లెక్పాల్ రిక్రూట్‌మెంట్ : 1,364 జాబ్స్... ఇంటర్వ్యూ లేకుండా సెలక్షన్స్... ఇలా అప్లై చేసుకోండి
UPSSSC నోటిఫికేషన్ (Image : UPSSSC
Krishna Kumar N | news18-telugu
Updated: March 11, 2019, 7:49 AM IST
UPSSSC Chakbandi Lekhpal Recruitment 2019 : ఉత్తరప్రదేశ్ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్ తాజాగా UPSSSC చక్బందీ లెక్పాల్ రిక్రూట్‌మెంట్ 2019కి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ upsssc.gov.in నుంచీ రిజిస్టర్ చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించాల్సిన చివరి తేదీ ఏప్రిల్ 5, 2019గా సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈ పోస్టుల ప్రత్యేకత ఏంటంటే... వీటికి ఇంటర్వ్యూలు ఉండవు. రాత పూర్వక పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. తాజా నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1,364 ఉద్యోగాలను భర్తీ చెయ్యబోతున్నారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ రూ.21,700 నుంచీ రూ.69,100 వరకూ ఇస్తారు. నోటిఫికేషన్ వివరాల కోసం ఈ లింక్ ‌లోకి వెళ్లొచ్చు. http://upsssc.gov.in/UploadNotices/ADVT_1332.pdf

ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తేదీ : మార్చి 6, 2019

అప్లికేషన్లు పంపేందుకు చివరి తేదీ : ఏప్రిల్ 5, 2019
ఫీజ్ చెల్లించేందుకు చివరి తేదీ : ఏప్రిల్ 5, 2019


అడ్మిట్ కార్డులు జారీ చేసే తేదీ : ఇంకా ప్రకటించలేదు.

కేటగిరీ ప్రకారం ఖాళీగా ఉన్న పోస్టులు :
Loading...
జనరల్ - 1,002
SC/ST - 362
ఫ్రీడం ఫైటర్ - 27
దివ్యాంగులు - 54
మహిళలు - 272

అప్లికేషన్ ఫీజు వివరాలు :
జనరల్ కేటగిరీ - 160 + 25 (ఆన్ లైన్ ఛార్జీలు) = Rs 185
OBC కేటగిరీ - 160 + 25 (ఆన్ లైన్ ఛార్జీలు) = Rs 185
SC కేటగిరీ - 70 + 25 (ఆన్ లైన్ ఛార్జీలు) = Rs 95
ST కేటగిరీ - 70 + 25 (ఆన్ లైన్ ఛార్జీలు) = Rs 95
PH కేటగిరీ - 25 (ఆన్ లైన్ ఛార్జీలు) = Rs 25

అప్లికేషన్ ఫీజును ఆన్‌లైన్‌లో డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాకింగ్/ఈ-ఇన్వాయిస్/SBI ఈ-సర్వీస్ ద్వారా చెల్లించవచ్చు.

వయసు పరిమితి : కనీస వయస్సు 18 ఏళ్లు, గరిష్ట వయస్సు 40 ఏళ్లు

ఎలా అప్లై చెయ్యాలి :
* అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. రిజిస్టర్ చేసుకోండి. upsssc.gov.in.
* మీ ఫొటో, సంతకం అప్‌లోడ్ చెయ్యండి.
* అప్లికేషన్ ఫారంలో మిగతా వివరాలు నింపండి.
* ఫీజు చెల్లించండి. అప్లికేషన్ ఫారంను సబ్‌మిట్ చెయ్యండి.
* అప్లికేషన్‌ను ప్రింట్ తీసుకోండి. దాన్ని మీ దగ్గర ఉంచుకోండి.

 

ఇవి కూడా చదవండి :

CWC జాబ్ రిక్రూట్‌మెంట్... 571 పోస్టులు... అకౌంటెంట్లు, ట్రాన్స్‌లేటర్లు...

RRB Recruitment 2019 : 1000కి పైగా పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్

NHB జాబ్స్... అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు... శాలరీ రూ.42,000

ఉదయాన్నే వెల్లుల్లి తింటే... అద్భుతమైన ప్రయోజనాలు... ఇలా చెయ్యండి...
First published: March 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...