సోషల్ మీడియాను వదిలేస్తే మీరే ఐఏఎస్ -సివిల్స్ టాపర్స్ సలహా..

UPSC Toppers | ఈ మధ్యే యూపీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో వివిధ ప్రాంతాలకు చెందిన వారు టాపర్స్‌గా నిలిచారు. వీరి సక్సెస్ ఫార్మూలా ఏంటని ఆరా తీస్తే మాత్రం.. వినిపించే ఒకే మాట సోషల్ మీడియాకు దూరంగా ఉండడం..

news18-telugu
Updated: April 15, 2019, 10:34 AM IST
సోషల్ మీడియాను వదిలేస్తే మీరే ఐఏఎస్ -సివిల్స్ టాపర్స్ సలహా..
ఆల్ ఇండియా టాపర్ కనిషక్ కటారియా
  • Share this:
ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్‌ఇన్ పేరు ఏదైతే ఏంటి.. ఈ సోషల్ యాప్స్‌కి అలవాటు పడితే సమయమే తెలియదు. ఈ కారణంగానే చాలామంది స్టూడెంట్స్ వీటి ముందు కూర్చుని టైమ్ పాస్ చేస్తుంటారు. సమయాన్ని వృథా చేస్తుంటారు. అనేక వ్యసనాల్లానే ఇది కూడా ఓ వ్యసనమే.. దీన్ని అధిగమించినవారే విజేతలు అవుతారని నిరూపించారు సివిల్స్ టాపర్స్.. అవును.. యూపీఎస్సీ సివిల్స్ టాపర్స్‌లో చాలా మందిలో ఉండే కామన్ పాయింట్ సోషల్ మీడియాకి దూరంగా ఉండడమే. ఈ విషయాన్నిస్వయంగా వారే చెబుతున్నారు.
నేను నా ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్స్ డీయాక్టివేట్ చేశా. ఇన్‌స్టాగ్రామ్ అప్పుడుపుడు వాడేవాడిని.. అదీ కూడా చాలా తక్కువ.. ఆ సమయాన్నంతా నేను సివిల్స్ ర్యాంకింగ్‌పైనే ఫోకస్ చేశా
-ఆల్ ఇండియా టాపర్ కనిషక్ కటారియా

అదే విధంగా నాల్గవ ర్యాంకు సాధించిన శ్రేయాన్స్ కుమత్, ఐదో ర్యాంకు సాధించిన సృష్టి జయంత్ దేశ్‌ముఖ్, 13వ ర్యాంకు సాధించిన వర్ణిత్ నేగి కూడా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. దీని వల్ల ఎంతో సమయం మిగిలిందని.. ఆ సమయమే సివిల్స్ టాపర్స్‌ని చేసిందని చెబుతున్నారు.

ఇక ఆల్ ఇండియాలో 17 ర్యాంకు సాదించిన రాహుల్ శరణప్ప అయితే.. కనీసం స్మార్ట్ ఫోన్ కూడా వాడలేదట. ర్యాంకు సాధించిన తర్వాత మాత్రం ఇప్పుడు ఫోన్ వాడుతున్నట్లు హ్యాపీగా చెప్పాడు.
వీరే కాదు.. తన్మయి వశిష్ఠ శర్మ..ఇతను 26ఏళ్ల వయస్సులో ఐపీఎస్ విభాగంలో 10వ ర్యాంకు సాధించాడు. ప్రిపరేషన్ సమయంలో శర్మ.. కేవలం కొన్ని సోషల్ మీడియా యాప్స్‌ని మాత్రం ఫాలో అయ్యేవాడు. ట్విట్టర్, ఫేస్‌బుక్ ఇలా.. ఇవి కూడా కేవలం వార్తాపత్రికల్లోని సారాంశం తెలుసుకోవడం కోసం మాత్రమే.. అదే విధంగా యూట్యూబ్‌‌లోని ప్రిపరేషన్ వీడియోస్‌ తనకి చాలా బాగా హెల్ప్ అయ్యాయని చెబుతున్నారు. అక్షత్ అనే మరో ర్యాంక్ కేవలం వాట్సప్ మాత్రమే వాడేవారు.. అందులోనూ స్టడీ గ్రూప్స్ ద్వారా ఎగ్జామ్స్‌కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి యూజ్ చేసేవాడు.. మధ్యలో ఓ 5 నిమిషాలు రిలాక్సేషన్ కోసం ఫేస్‌బుక్ వాడేవాడు.
కేవలం వీరే కాదు.. ఐఏఎస్, ఐపీఎస్, బిట్స్‌ పిలానీల్లో ర్యాంక్స్ సాధించనవారందరిలో కామన్ పాయింట్ ఒక్కటే సోషల్ మీడియాకు దూరంగా ఉండడం. విభిన్న రంగాల్లో ఆరితేరినవారంతా కూడా సోషల్ మీడియాకి దూరంగా ఉన్నవారే.ఇవి కూడా చదవండి..EIL Jobs : ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా.. రేపే చివరిరోజు..
First published: April 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు