నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సివిల్స్ పరీక్షల షెడ్యూల్ ఇదే..

UPSC Civil Services Exam 2020 Dates | ప్రతి సంవత్సరం దాదాపు 7 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షలకు రాస్తుంటారు. కానీ ఈ సంవత్సరం సుమారు 10 లక్షల మంది ప్రిలిమ్స్ రాసేందుకు అప్లై చేసుకున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: June 5, 2020, 6:59 PM IST
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సివిల్స్ పరీక్షల షెడ్యూల్ ఇదే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆ కమిషన్ 2020 సంవత్సారానికి సంబంధించి నిర్వహించే సివిల్స్ పరీక్షల షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. అందులో భాగంగానే అక్టోబరు 4, 2020న సివిల్స్ ప్రిలిమినరీ, జనవరి 8, 2021న యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్టు తెలిపింది. వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం ప్రిలిమినరీ పరీక్షను మే 31న నిర్వహించాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా వాయిదా వేశారు.

ఇదిలావుంటే.. 2019 సంవత్సరానికి సంబంధించి నిర్వహించాల్సిన పర్సనాలిటీ టెస్టులు జూలై 20, 2020 నుంచి ప్రారంభమవుతాయని, ఎంపికైన అభ్యర్థులకు వ్యక్తిగతంగా సమాచారం అందించనున్నట్టు యూపీఎస్సీ పేర్కొంది. అయితే ప్రతి సంవత్సరం దాదాపు 7 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షలకు రాస్తుంటారు. కానీ ఈ సంవత్సరం సుమారు 10 లక్షల మంది ప్రిలిమ్స్ రాసేందుకు అప్లై చేసుకున్నట్టు తెలుస్తోంది.


Published by: Narsimha Badhini
First published: June 5, 2020, 6:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading