హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CAPF: సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫారమ్ విడుదల... అప్లికేషన్ ప్రాసెస్ ఇదే..

CAPF: సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫారమ్ విడుదల... అప్లికేషన్ ప్రాసెస్ ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CAPF: సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌కు సంబంధించిన డీటెయిల్డ్ అప్లికేషన్ ఫారమ్(DAF)ను యూపీఎస్సీ విడుదల చేసింది. సీఏపీఎఫ్-2022 రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in ద్వారా DAF కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఆల్ ఇండియా సర్వీసెస్ (All India Services), కేంద్ర సర్వీసుల్లో గ్రూప్‌-ఎ, గ్రూప్‌-బి వంటి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. జాతీయ స్థాయిలో అత్యున్నత సర్వీసుల కోసం అభ్యర్థుల ఎంపికను పటిష్ఠంగా, పారదర్శకంగా నిర్వహించడం యూపీఎస్సీ విధి. తాజాగా సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌కు సంబంధించిన డీటెయిల్డ్ అప్లికేషన్ ఫారమ్(DAF)ను యూపీఎస్సీ విడుదల చేసింది. సీఏపీఎఫ్-2022 రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in ద్వారా DAF కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు చివరి తేదీ అక్టోబర్ 9 సాయంత్రం 6 వరకు ఉంది.

* అప్లికేషన్ ప్రాసెస్

ఈ ఫారమ్ కోసం అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు UPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. హోమ్‌పేజీలో UPSC CAPF DAF లింక్‌పై క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ ఐడీని ఎంటర్ చేసి ఐడీతో లాగిన్ అవ్వండి. ఆ తరువాత డీటెయిల్డ్ అప్లికేషన్ ఫారమ్(DAF)ను నింపండి. అలాగే అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి. చివరగా అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయండి. ఇక, భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసి, సేవ్ చేసుకోండి.

* ఎంపిక ప్రక్రియ

- అప్లై చేసుకున్న అభ్యర్థులకు మొదట రాత పరీక్ష ఉంటుంది.

- అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది.

- ఈ టెస్టుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

* ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారంటే?

యూపీఎస్సీ సీఏపీఎఫ్ (UPSC CAPF) తాజా రిక్రూట్‌మెంట్ ద్వారా వివిధ సాయుధ దళాలలో 253 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో BSF నుంచి 66 పోస్టులు, CRPF- 29, CISF-62, ITBP- 14, SSB నుంచి 82 ఫోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇది కూడా చదవండి : ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా వెళ్తున్నారా..? రూ.1కోటి స్కాలర్‌షిప్ పొందే అవకాశం..!

కాగా, యూపీఎస్సీ సీఏపీఎఫ్-2022 రాత పరీక్ష ఆగస్టు 7న జరిగిన సంగతి తెలిసిందే. ఫలితాలు సెప్టెంబర్ 16న విడుదలయ్యాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు DAFను సమర్పించడానికి అర్హులు. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఫిజికల్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ రౌండ్‌కు పిలుస్తారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, సశాస్త్ర సీమా బాల్ ద్వారా CAPFలో అసిస్టెంట్ కమాండెంట్ల రిక్రూట్‌మెంట్ కోసం యూపీఎస్సీ పరీక్షను నిర్వహిస్తుంటుంది.

* ఈ సర్టిఫికేషన్స్ తప్పనిసరి..

ఇంటర్వ్యూ జరిగే సమయంలో అభ్యర్థులు ఏజ్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, కేటగిరీ సర్టిఫికేట్ (వర్తిస్తే) ఒరిజినల్ అటెస్టెడ్, స్కాన్డ్ కాపీలను సిద్ధం చేసుకోవాలి. ఒక వేళ ఎవరైనా ఇందులో విఫలమైతే సదరు అభ్యర్థి దరఖాస్తును తిరస్కరిస్తారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: BSF, Career and Courses, CRPF, JOBS, UPSC

ఉత్తమ కథలు