UPSC Recruitment 2021: యూపీఎస్సీలో 59 ఖాళీలు.. అర్హ‌త‌లు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (Union Public Service Commission) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనేందుకు అక్టోబ‌ర్ 14, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా నావ‌ల్ క్వాలిటీ అజ్యూరెన్స్, నేవీ, జియ‌లాజిక‌ల్ స‌ర్వే, ఎక‌న‌మిక్ ఇన్వెస్టిగేష‌న్ విభాగాల్లో అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

  • Share this:
    యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (Union Public Service Commission) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా అసిస్టెంట్ ఇంజ‌నీఇర్‌, టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌, హైడ్రోగ్రాఫిక్ ఆఫీస‌ర్ విభాగాల్లో 59 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనేందుకు అక్టోబ‌ర్ 14, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా నావ‌ల్ క్వాలిటీ అజ్యూరెన్స్, నేవీ, జియ‌లాజిక‌ల్ స‌ర్వే, ఎక‌న‌మిక్ ఇన్వెస్టిగేష‌న్ విభాగాల్లో అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. రిక్రూట్‌మెంట్ టెస్ట్‌ (Recruitment Test), ఇంట‌ర్వ్యూ (Interview) ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. పోస్టుల‌ను అనుస‌రించి అభ్య‌ర్థుల వ‌య‌సు గ‌రిష్టంగా 30 ఏళ్ల నుంచి 35 ఏళ్లు ఉండాలి. నోటిఫికేష‌న్‌కు సంబంధించి వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.upsc.gov.in/ ను సంద‌ర్శించాలి.

    ముఖ్య‌మైన స‌మాచారం..























    పోస్టుల సంఖ్య 59
    పోస్టులు అసిస్టెంట్ ఇంజ‌నీర్‌, సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస‌ర్‌, జూనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ డైరెక్ట‌ర్ త‌దిత‌ర పోస్టులు
    అర్హ‌త‌లు ఆయా పోస్టుల‌ను అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల‌లో ఇంజ‌నీరింగ్ డిగ్రీ, మాస్ట‌ర్ డిగ్రీ పాసై ఉండాలి.
    ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 14, 2021
    అప్లికేష‌న్ లింక్ https://www.upsconline.nic.in/

     ఎంపిక విధానం..
    - అభ్య‌ర్థుల‌ను రిక్రూట్‌మెంట్ ప‌రీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
    - ముందుగా ప‌రీక్ష నిర్వ‌హించి అనంత‌రం ఇంట‌ర్వ్యూ (Interview) చేస్తారు.
    - అన్ని పాసైన అభ్య‌ర్థుల‌ను ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

    HPCL Recruitment: హెచ్‌పీసీఎల్ బ‌యోఫ్యూయ‌ల్‌లో 255 ఉద్యోగాలు..


    ద‌ర‌ఖాస్తు విధానం..
    Step 1:  ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ (Online) ద్వారా ఉంటుంది.
    Step 2:  ముందుగా నోటిఫికేష‌న్ చ‌దివి ద‌ర‌ఖాస్తుకు అర్హ‌త ఉందో లేదో చూసుకోవాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)
    Step 3:  అనంత‌రం ద‌ర‌ఖాస్తు చేసుకొనేందుకు https://www.upsconline.nic.in/ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాలి.
    Step 4:  ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్త‌యిన అనంత‌రం ఫీజు చెల్లించాలి.
    Step 5:  ప్ర‌క్రియ పూర్తియ‌న త‌రువాత అప్లికేష‌న్ ఫాంను ప్రింట్ (Print) తీసుకొని పెట్టుకోవాలి.
    Step 6:  ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 14, 2021
    Published by:Sharath Chandra
    First published: