హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UPSC Exams: యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీస్ 2022 నోటిఫికేషన్ విడుదల

UPSC Exams: యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీస్ 2022 నోటిఫికేషన్ విడుదల

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ 2022 నోటిఫికేషన్ (Notification) విడుదల అయ్యింది. . UPSC ESE 2022 ఎగ్జామ్‌కు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 22, 2021 నుంచి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 20 2022న యూపీఎస్సీ పరీక్ష నిర్వహించనుంది.

ఇంకా చదవండి ...

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSCఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ 2022 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in ఓపెన్ చేసి వివరాలు చూడొచ్చు. UPSC ESE 2022 ఎగ్జామ్‌కు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 22, 2021 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 12, 2021 వరకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసే అభ్యర్థులు ముందుగా పార్ట్-1, పార్ట్-2 అప్లికేషన్ పూర్తి చేయడం మర్చిపోవద్దు. ఫిబ్రవరి 20 2022న యూపీఎస్సీ ఈఎస్ఈ ఎగ్జామ్ నిర్వహించనుంది.  దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్ లైన్ ద్వారా ఉంటుంది. దరఖాస్తు చేసుకోవాలనుకొన్న అభ్యర్థులు రూ.200 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలకు పరీక్ష ఫీజు లేదు.

ముఖ్యమైన సమాచారం..

మొత్తం పోస్టులు247
వయోపరిమితి21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి
పరీక్ష కేంద్రాలుహైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం
డిపార్ట్ మెంట్లుసివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్


IGNOU Jobs: ఇగ్నోలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. అర్హతలు ఇవే


ఎంపిక విధానం..

- పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

- ఇంజనీరింగ్ సర్వీస్ ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహిస్తారు.

- అనంతరం పర్సనాలిటీ టెస్ట్ ద్వారా అభ్యర్థిని ఎంపిక చేస్తారు.

దరఖాస్తు చేసుకొనే విధానం..

Step 1: ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in ఓపెన్ చేయండి.

Step 2: అనంతరం ONLINE APPLICATION FOR VARIOUS EXAMINATIONS OF UPSC మీద క్లిక్ చేస్తే యూపీఎస్సీ నిర్వహిస్తున్న పరీక్షలు కనబడతాయి.

Step 3: తరువాత 'Engineering Services (Preliminary/Stage I) Examination' లింక్ పైన క్లిక్ చేయండి.

Step 4: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ వివరాలతో రిజిస్టర్ చేసుకోండి.

Step 5: ముఖ్యమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి దరఖాస్తు సబ్మిట్ చేయండి.

Step 6: పేమెంట్ చేసిన తర్వాత ఫోటో ఐడీ కార్డ్, ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ కాపీ అప్‌లోడ్ చేయాలి.

Step 7: చివరగా సబ్మిట్ క్లిక్ చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.

Step 8: ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.

First published:

Tags: CAREER, Engineering, Govt Jobs 2021, Job notification, JOBS, UPSC