కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఉద్యోగాల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 187 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ టైమ్ స్కేల్, అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 జనవరి 13 చివరి తేదీ. అంటే మరో 10 రోజులు మాత్రమే అవకాశం ఉంది. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.
మొత్తం ఖాళీలు | 187 | విద్యార్హతలు |
అసిస్టెంట్ కమిషనర్ (క్రాప్స్) | 2 | అగ్రికల్చరల్ ఎకనమిక్స్ లేదా అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ లేదా అగ్రోనామి లాంటి సబ్జెక్ట్స్‌లో పీజీ పాస్ కావాలి. |
అసిస్టెంట్ ఇంజనీర్ క్వాలిటీ అష్యూరెన్స్ (అర్మామెంట్-అమ్యూషన్) | 29 | ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్‌తో మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ పాస్ కావాలి. |
అసిస్టెంట్ ఇంజనీర్ క్వాలిటీ అష్యూరెన్స్ (ఎలక్ట్రానిక్స్) | 74 | ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్‌తో మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ పాస్ కావాలి. |
అసిస్టెంట్ ఇంజనీర్ క్వాలిటీ అష్యూరెన్స్ (జెన్‌టెక్స్) | 54 | ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్‌తో మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ పాస్ కావాలి. |
జూనియర్ టైమ్ స్కేల్ గ్రేడ్ ఆఫ్ సెంట్రల్ లేబర్ సర్వీస్ | 17 | డిగ్రీ పాస్ కావాలి. దీంతో పాటు డిప్లొమా ఇన్ సోషల్ వర్క్ లేదా లేబర్ వెల్‌ఫేర్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా పర్సనల్ మేనేజ్‌మెంట్ లేదా లేబర్ లా పాస్ కావాలి. |
అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ | 9 | బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి |
అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఆయుర్వేద, రచనా శరీర్) | 1 | ఆయుర్వేద మెడిసిన్‌లో డిగ్రీ పాస్ కావాలి. |
అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఆయుర్వేద, మౌలిక్ సిద్ధాంత ఎవుమ్ సంహిత) | 1 | ఆయుర్వేద మెడిసిన్‌లో డిగ్రీ పాస్ కావాలి. |
TCS Jobs 2022: డిగ్రీ అర్హతతో టీసీఎస్‌లో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జనవరి 13
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
దరఖాస్తు ఫీజు- జనరల్ అభ్యర్థులకు రూ.25. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
వయస్సు- 30 నుంచి 40 ఏళ్లు
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Step 1- అభ్యర్థులు ముందుగా యూపీఎస్‌సీ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ https://upsconline.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో ONLINE RECRUITMENT APPLICATION (ORA) FOR VARIOUS RECRUITMENT POSTS పైన క్లిక్ చేస్తే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ కనిపిస్తుంది.
Step 3- లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించి అప్లికేషన్ లింక్స్ వేర్వేరుగా ఉంటాయి.
Step 4- అభ్యర్థి ఏ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకుంటే ఆ పోస్టుకు సంబంధించిన Apply Now లింక్ పైన క్లిక్ చేయాలి.
Step 5- New Registration పైన క్లిక్ చేసి అభ్యర్థి తన వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 6- అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసిన తర్వాత ఫీజు చెల్లించాలి.
Step 7- అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.