హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UPSC Recruitment 2022: యూపీఎస్సీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్.. అర్హత, దరఖాస్తు విధానం ఇలా..

UPSC Recruitment 2022: యూపీఎస్సీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్.. అర్హత, దరఖాస్తు విధానం ఇలా..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

UPSC Recruitment 2022: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్ లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(Union Public Service Commission) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 37 పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్(Notification) విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో ఈ వివరాలను పొందుపరిచారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు. UPSC విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థులు ఈ ఖాళీల కోసం తమ దరఖాస్తులను సెప్టెంబర్ 1, 2022 వరకు మర్పించవచ్చు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఆన్‌లైన్‌లో మాత్రమే జరుగుతున్నందున.. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులను పంపించవద్దని అధికారులను పేర్కొన్నారు.

UGC Scholarships: డిగ్రీ, పీజీ చేస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్.. యూజీసీ నుంచి 4 స్కాలర్ షిప్ లకు దరఖాస్తుల ఆహ్వానం..


ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు

1. అసిస్టెంట్ డైరెక్టర్ : 02 పోస్టులు

2. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫ్లయింగ్ ట్రైనింగ్: 04 పోస్టులు

3. సైంటిఫిక్ ఆఫీసర్ (నాన్ డిస్ట్రక్టివ్): 01 పోస్ట్

3. ఫోటోగ్రాఫిక్ ఆఫీసర్: 01 పోస్ట్

5. సీనియర్ ఫోటోగ్రాఫిక్ ఆఫీసర్: 01 పోస్ట్

6. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (ఫిజిక్స్): 01 పోస్ట్

7. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (న్యూట్రాన్ యాక్టివేషన్ అనాలిసిస్): 1 పోస్ట్

8. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ సీనియర్ గ్రేడ్: 22 పోస్ట్

9. రైల్వే డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్: 01 పోస్ట్

10. నేషనల్ అట్లాస్ అండ్ థీమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్‌లో డైరెక్టర్: 01 పోస్ట్

11. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(సివిల్)/సర్వేయర్ ఆఫ్ వర్క్స్(సివిల్): 02 పోస్టులు

అర్హతలు..

ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, బీఈ/బీటెక్‌, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరేట్, ఎల్‌ఎల్‌బీ, మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి..

అభ్యర్థుల యొక్క వయస్సు జులై 31, 2022 నాటికి 50 ఏళ్లకు మించకూడదు.

దరఖాస్తు ఫీజు..

జనరల్ అభ్యర్థులు రూ.25 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ అభ్యర్థులకు ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పీడబ్ల్యూబీడీ ఈ దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

ఎంపిక విధానం..

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు ఎలా చేయాలో తెలుసుకుందాం..

- అభ్యర్థులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in ని సందర్శించాలి.

- హోమ్‌పేజీలో, సంబంధిత రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.

- మీరు దరఖాస్తు చేయాలనుకుంటున్న పోస్ట్‌ను ఎంచుకుని సంబంధిత సమాచారాన్ని అందించిన వెంటనే మరో పేజీ ఓపెన్ అవుతుంది.

- దీనిలో అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు రుసుమును చెల్లించి .. దరఖాస్తును ఆన్ లైన్ లో సబ్ మిట్ చేయవచ్చు.

- భవిష్యత్తు అవసరాల కోసం దాని కాపీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.

First published:

Tags: Career and Courses, JOBS, UPSC

ఉత్తమ కథలు