Home /News /jobs /

UPSC RECRUITMENT 2022 APPLICATIONS INVITING FOR 78 JUNIOR MINING GEOLOGIST OTHER POSTS HERE DETAILS NS

UPSC Recruitment 2022: ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలోనే అత్యున్నత ఉద్యోగ నియామక సంస్థ అయిన యూపీఎస్సీ (UPSC) నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. జూనియర్ మైనింగ్ జియాలజిస్ట్ తో పాటు ఇతర ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 78 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు upsc.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు జనవరి 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    Job Mela in AP: ఏపీలో కియా మోటార్స్ తో పాటు రెండు ప్రముఖ సంస్థల్లో జాబ్స్.. రేపే ఇంటర్వ్యూలు.. రిజిస్ట్రేషన్ ఇలా

    ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..
























































    పోస్టుఖాళీలు
    అసిస్టెంట్ ఎడిటర్ (Oriya):1
    అసిస్టెంట్ డైరెక్టర్ (Cost):16
    ఎకనామిక్ ఆఫీసర్:4
    అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్:1
    మెకానికల్ మెరైన్ ఇంజనీర్:1
    లెక్చరర్:4
    సైంటిస్ట్:2
    కెమిస్ట్:5
    జూనియర్ మైనింగ్ జియోలజిస్ట్:36
    రీసెర్చ్ ఆఫీసర్:1
    అసిస్టెంట్ ప్రొఫెసర్:7
    మొత్తం:78

    వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరుగా విద్యార్హతలను నిర్ణయించారు. విద్యార్హతలు, వయో పరిమితికి సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు ఈ లింక్ ద్వారా నోటిఫికేషన్లో చూడొచ్చు.
    Currency Note Press Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. కరెన్సీ నోట్ ప్రెస్ లో 149 జాబ్స్.. ఇలా అప్లై చేయండి

    అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అప్లై చేసే సమయంలో రూ.25ను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆ ఫీజును ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించొచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు.
    Telangana Govt Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఆ జిల్లాలో బ్యాక్ లాగ్ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

    ఎలా అప్లై చేయాలంటే:
    Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
    Step 2: అనంతరం ONLINE RECRUITMENT APPLICATION (ORA) FOR VARIOUS RECRUITMENT POSTS ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Step 3: అక్కడ పైన తెలిపిన ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి.


    Step 4: ప్రతీ పోస్టు పక్కన Apply Now ఆప్షన్ కనిపిస్తుంది.
    Step 5: అభ్యర్థులు ఆ ఆప్షన్ పై క్లిక్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
    Step 6: దరఖాస్తు పూర్తయిన తర్వాత అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని భ్యవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.
    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Central Government Jobs, UPSC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు