Home /News /jobs /

UPSC Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. యూపీఎస్సీ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

UPSC Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. యూపీఎస్సీ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 11వ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor), సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, అసిస్టెంట్ డిఫెన్స్ ఎస్టేట్స్, అసిస్టెంట్ డైరెక్టర్, మెడికల్ ఆఫీసర్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ upsconline.nic.in లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో తెలిపారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 11 ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అయితే.. వేర్వేరు విభాగాల్లోని ఖాళీలకు వేర్వేరుగా విద్యార్హతలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.



























    పోస్టు ఖాళీలు
    అసిస్టెంట్ ప్రొఫెసర్ 1
    అసిస్టెంట్ డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీసర్ 6
    సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 16
    అసిస్టెంట్ డైరెక్టర్ 33
    మెడికల్ ఆఫీసర్ 8

    విద్యార్హతల వివరాలు..
    -అసిస్టెంట్ ప్రొఫెసర్(Assistant Professor): Mechatronicsలో మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    -అసిస్టెంట్ డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీసర్(ADEO): సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. రెండేళ్ల పాటు పని చేసిన అనుభవం ఉండాలి.
    -అసిస్టెంట్ డైరెక్టర్ (Assistant Director): సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    -మెడికల్ ఆఫీసర్ (Medical Officer): సంబంధిత విభాగంలో డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ విభాగంలోని ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
    IOCL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. IOCLలో 1968 ఖాళీలు.. ఇలా అప్లై చేసుకోండి

    వయో పరిమితి:
    అసిస్టెంట్ ప్రొఫెసర్ - 38 ఏళ్లు
    అసిస్టెంట్ డిఫెన్స్ ఎస్టేట్స్ - 30 ఏళ్లు
    సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ - 35 ఏళ్లు
    అసిస్టెంట్ డైరెక్టర్ - 35 ఏళ్లు
    మెడికల్ ఆఫీసర్ - 35 ఏళ్లు
    BEL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. BEL నుంచి మరో నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

    ఎలా అప్లై చేయాలంటే..
    Step 1: అభ్యర్థులు ముందుగా నోటిఫికేషన్ ను పూర్తిగా చదవాలి.
    Step 2:  అనంతరం అధికార వెబ్ సైట్ https://upsconline.nic.in/ora/VacancyNoticePub.php ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
    Step 3: పైన ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి.
    Step 4: అనంతరం కావాల్సిన వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
    Step 5:  అప్లై చేసే సమయంలో రూ.25ను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.  ఎస్టీ, ఎస్సీ, మహిళ అభ్యర్థులకు ఫీజు మినహాయింపును ఇచ్చారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Government jobs, Job notification, UPSC

    తదుపరి వార్తలు