హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UPSC Recruitment 2021: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... రూ.2,18,000 వరకు వేతనం

UPSC Recruitment 2021: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... రూ.2,18,000 వరకు వేతనం

UPSC Recruitment 2021: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... రూ.2,18,000 వరకు వేతనం
(ప్రతీకాత్మక చిత్రం)

UPSC Recruitment 2021: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... రూ.2,18,000 వరకు వేతనం (ప్రతీకాత్మక చిత్రం)

UPSC Recruitment 2021 | సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోరుకునేవారికి అలర్ట్. పలు ఖాళీల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC). జాబ్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Govt Jobs) విడుదల చేసింది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్, సీనియర్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 36 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 2 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, ఖాళీలు, విద్యార్హతల గురించి తెలుసుకోండి.

Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగానికి అప్లై చేశారా? అయితే వెంటనే ఇలా చేయండి

UPSC Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు36విద్యార్హతలువయస్సు
ప్రొఫెసర్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్)1ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ53 ఏళ్ల లోపు
అసోసియేట్ ప్రొఫెసర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్)3ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ50 ఏళ్ల లోపు
అసోసియేట్ ప్రొఫెసర్ (కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్)3కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్‌లో బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ50 ఏళ్ల లోపు
అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్)7ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ35 ఏళ్ల లోపు
అసిస్టెంట్ ప్రొఫెసర్ (కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్)5కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్‌లో బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ35 ఏళ్ల లోపు
జాయింట్ అసిస్టెంట్ డైరెక్టర్3బీటెక్, బీఈ, బీఎస్‌సీ30 ఏళ్ల లోపు
డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్6ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, కామర్స్, సైకాలజీ, సోషియాలజీ, సోషల్ వర్క్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ40 ఏళ్ల లోపు
సీనియర్ అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ మైన్స్8మైనింగ్ ఇంజనీరింగ్‌లో బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ40 ఏళ్ల లోపు


APPSC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లో 38 నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

UPSC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 2

విద్యార్హతలు- సంబంధిత బ్రాంచ్‌లో బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ లాంటి కోర్సులు పాస్ కావాలి.

దరఖాస్తు ఫీజు- రూ.25. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.

వేతనం- ఎంపికైనవారికి రూ.2,18,000 వరకు వేతనం లభిస్తుంది.

ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

First published:

Tags: Bank Jobs, CAREER, Central Government Jobs, Govt Jobs 2021, Job notification, JOBS, UPSC

ఉత్తమ కథలు