• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • UPSC RECRUITMENT 2021 UNION PUBLIC SERVICE COMMISSION RELEASED FRESH JOB NOTIFICATION FOR 259 VACANCIES KNOW HOW TO APPLY SS

UPSC Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... 249 పోస్టులతో యూపీఎస్‌సీ నోటిఫికేషన్

UPSC Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... 249 పోస్టులతో యూపీఎస్‌సీ నోటిఫికేషన్

UPSC Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... 249 పోస్టులతో యూపీఎస్‌సీ నోటిఫికేషన్ (ప్రతీకాత్మక చిత్రం)

UPSC Recruitment 2021 | యూపీఎస్‌సీ 249 పోస్టులతో తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలతో పాటు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

  • Share this:
    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది యూపీఎస్‌సీ. మొత్తం 249 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 11 చివరి తేదీ. అభ్యర్థులు అప్లై చేయడానికి ముందు నోటిఫికేషన్ చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌ పూర్తి వివరాలు యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://www.upsc.gov.in/ లో ఉంటాయి. అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి.

    UPSC Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 249
    జూనియర్ టెక్నికల్ ఆఫీసర్- 6
    అసిస్టెంట్ డైరెక్టర్ (ఫిషింగ్ హార్బర్)- 1
    స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫోరెన్సిక్ మెడిసిన్)- 6
    స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (పబ్లిక్ హెల్త్)- 5
    స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (సర్జికల్ ఆంకాలజీ)- 2
    స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (సోషల్ అండ్ ప్రివెంటీవ్ మెడిసిన్ లేదా కమ్యూనిటీ మెడిసిన్)- 12
    స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫిజికల్ మెడిసిన్ అండ్ రీహ్యాబిలిటేషన్)- 7
    స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (రేడియో థెరపీ)- 7
    స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (యూరాలజీ)- 6
    లెక్చరర్ (మెడికల్ సోషల్ వర్క్)- 1
    అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్- 8
    డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్- 116

    IDBI Bank Jobs: ఐడీబీఐ బ్యాంకులో 134 జాబ్స్... దరఖాస్తుకు రెండు రోజులే ఛాన్స్

    Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల... వారికి మాత్రమే

    UPSC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 11
    దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 12
    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
    వయస్సు- గరిష్టంగా 35 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీస్ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.
    వేతనం- ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వ 7వ వేతన స్కేల్ వర్తిస్తుంది.
    దరఖాస్తు ఫీజు- రూ.25

    ECIL Hyderabad Recruitment 2021: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ జాబ్ నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

    SBI Recuritment 2021: ఎస్‌బీఐలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... అప్లై చేయండి ఇలా

    UPSC Recruitment 2020: అప్లై చేయండి ఇలా...


    ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.
    విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    హోమ్ పేజీలో ONLINE RECRUITMENT APPLICATION (ORA) FOR VARIOUS RECRUITMENT POSTS పైన క్లిక్ చేయాలి.
    అందులో వేర్వేరు పోస్టులకు వేర్వేరు లింక్స్ ఉంటాయి.
    దరఖాస్తు చేయాలనుకున్న పోస్టుకు సంబంధించిన Apply Now లింక్ క్లిక్ చేయాలి.
    ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published: